రకుల్ ప్రీత్ సింగ్… అందం, అభినయాల కలబోత. దాంతో పాటు లక్ కూడా కలిసొచ్చింది. వ్యాపార లక్షణాలూ భేషుగ్గా ఉన్నాయి. అందుకే హైదరాబాద్‌లోఓ జిమ్ పెట్టి, ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో బ్రాంచ్ విశాఖపట్నంలోనూ ఓపెన్ చేస్తోందట. అన్నింటికి మించి మంచి మాటకారి. యేడాదికి నాలుగైదు ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎప్పుడూ బోర్ కొట్టకుండా, ఫ్రెష్ కంటెంట్ వచ్చేట్టు మాట్లాడుతుంటుంది. విన్నర్ కు సంబంధించిన ప్రమోషన్లలో విరివిగా పాలుపంచుకొంటోంది రకుల్. తన హీరోని, దర్శకుడ్నీ, టోటల్టీమ్ని ఎప్పటిలానే మొహమాటం లేకుండా పొగిడేస్తోంది. అయితే.. రకుల్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ హర్టవుతున్నారు.
”నేను వదులుకొన్న సినిమాలన్నీ ఫ్లాపులే అయ్యాయి. మరీ ముఖ్యంగా బ్రహ్మోత్సవం ఆఫర్ నాకే వచ్చింది. చివరి క్షణాల్లో హీరోయిన్లు మారారు. నా చేతులోంచి ఆ సినిమా చేజారిపోయింది. కానీ సినిమా ఫలితం చూశారు కదా.. ఫ్లాప్ అయ్యింది. అందుకే నేనేం బాధ పడలేదు..`”అంటూ మొహమాటం లేకుండా మాట్లాడేసింది. బ్రహ్మోత్సవం ఫ్లాపే. ఆ విషయంలో ఎవ్వరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. కానీ.. ఓ పక్క మహేష్ సినిమా చేస్తూ… బ్రహ్మోత్సవం ఫ్లాప్ అంటూ మీడియా ముందే చెప్పడం రకుల్‌ని ఇబ్బందుల్లో నెట్టేదే. దానికి తోడు.. ‘నేను వదిలేశాను కాబట్టే ఫ్లాప్ అయ్యింది’, ‘ఫ్లాప్ అయినందుకు ఆనందంగా ఉంది’ అనే అర్థాలొచ్చినట్టు మాట్లాడింది రకుల్. తన ఉద్దేశం అది కాకపోయినా.. మహేష్ వీర ఫ్యాన్స్‌కు అది అలానే వినిపించింది, కనిపించింది. దాంతో మహేష్ అభిమానులు కూసింత హర్టయ్యారు. అయినా ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చినప్పుడు.. ‘నేను వదులుకొన్న సినిమాలు ఫ్లాప్ అయ్యాయి’ అనాలి తప్ప, వాటి పేర్లు, హీరోల పేర్ల జోలికి పోకూడదు. ఈ విషయం రకుల్ ఎప్పుడు తెలుసుకొంటుందో ఏంటో?