హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో సహా ప్యారిస్ వెళుతున్నారు. దసరా సెలవులను సకుటుంబంగా ప్యారిస్‌లో గడపబోతున్నారు. ఈఫిల్ టవర్ చూడాలని గౌతమ్ కొన్నాళ్ళుగా అడుగుతున్నాడట. ప్రస్తుతం గౌతమ్, సితార ఇద్దరికీ స్కూల్‌కు దసరా సెలవులు కావటంతో గౌతమ్ కోరిక తీర్చటానికి ఇదే మంచి టైమ్ అని భావించి ప్యారిస్ టూర్‌కు ఏర్పాట్లు చేసుకున్నామని నమ్రత ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవలే బ్రహ్మోత్సవం రెండో షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ తదుపరి షెడ్యూల్ ప్రారంభమయ్యేలోపు గ్యాప్‌లో ప్యారిస్ వెళ్ళి వస్తారు. తిరిగొచ్చిన తర్వాత మురుగదాస్ ప్రాజెక్ట్‌పై ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభిస్తారని తెలిసింది. ఏదో ఒక సామాజిక అంశం ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు చేసే మురుగ మహేష్ సినిమాకు కూడా ఒక సామాజిక అంశాన్ని తీసుకుంటాడని సమాచారం. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా శృతి హాసన్‌ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు.