బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఫేమ్‌లోకి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలతో సెలబ్రిటీగా మారిన కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కారు.. వేగంగా ఎదురుగాఉన్న కంటెయినర్ లారీని ఢీకొట్టింది. పూర్తిగా మహేష్ కూర్చున్న వైపు కారు మొత్తం తునాతునకలయింది. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. అయితే ఆయన తలకు.. ముక్కుకు.. కళ్లకు తీవ్ర గాయాలు అయినట్లుగా వైద్యులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత నెల్లూరులోని ఆస్పత్రికితరలించారు. అక్కడ ముక్కుకు ఆపరేషన్ చేశారు కళ్లకు ఆపరేషన్లు చేయాల్సి ఉంది. కత్తి మహేష్‌కు ప్రమాదం గురించి తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో రెండు రకాల స్పందనలు కనిపిస్తున్నాయి.
కొంత మంది కత్తి మహష్కు జరిగిన ప్రమాదాన్ని కామెడీగా క్రియేట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ముఖ్యంగా ఓ హీరోకు చెందిన అభిమానులు… రాముడ్నిఆరాధించే మరోపార్టీకి చెందిన వారు.. మహేష్ కు జరిగిన ప్రమాదంపై దారుణ వ్యాఖ్యలు పెడుతున్నారు. ఆయనకు అలా జరగడం..ఆయనకు దేవుడు వేసిన శిక్ష అని కొంత మంది తీర్పులిస్తున్నారు. ఇప్పుడు.. కత్తి మహేష్ ప్రాణాలకేం ప్రమాదంలేదు కానీ.. ఆయన బతికి ఉన్నంత కాలం ఇబ్బందిపడతారని.. మరకొందరు మానవత్వం లేకుండాపోస్టులు పెడుతున్నారు. మరికొంత మంది మాత్రం … రాజకీయ.. సాహిత్యపరమైన విమర్శలు ఎప్పుడూ విమర్శలుగానే చూడాలని.. ఆయనకు కీడు జరగాలని కోరుకూడదని అంటున్నారు.
ఆయన మిత్రులు.. ఆయన కోసం ఆరా తీస్తూ… తాము ఉన్నామని భరోసా ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మధ్యాహ్నం వరకూ క్లారిటీ రాలేదు. స్వల్ప గాయాలు అయ్యాయని ఉదయం చెప్పుకున్నారు కానీ.. మధ్యాహ్నానికి ఆయనకు జరిగిన గాయాలు… తీవ్రమైనవేనని చెబుతున్నారు. ముక్కుకు ఆపరేషన్ పూర్తయిందని.. ఇతర ఆపరేషన్లు ఉన్నాయంటున్నారు. ఆయన హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వర్గాలు విడుదల చేయకపోవడంతో మరిన్ని రూమర్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలోరకరకాల చర్చలు జరుగుతున్నాయి.