“వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు” – ఇదీ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ట్వీట్.
అయితే ఇది కత్తి మహేష్ ని ఉద్దేశ్యించి చేసిందేనంటూ ప్రముఖ టివి ఛానెల్ భాష్యం చెప్పి, దీని మీద స్పందించాల్సింది గా నిత్య విమర్శకుడు కత్తి మహేష్ ని కోరడం తో ఆయన ఈ తరహా సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే-
“పవన్ కళ్యాణ్ ఒక అట్టర్ ఫ్లాప్ హీరో, ఆయనకి పది సంవత్సరాలుగా హిట్లు లేవు. అత్తారింటికి దారేది సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూరే. ఇక వ్యక్తిత్వం అంటే, నా వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కంటే చాలా గొప్పది. ఏ రకంగా చూసినా – సామాజికంగా, వ్యక్తిగతంగా ఎలా చూసినా నా వ్యక్తిత్వం, నా జీవితం చాలా గొప్పది. పవన్ కళ్యాణ్ కి ఏ వ్యక్తిత్వం ఉంది? కేవలం అభిమానుల అభిమానాన్ని దోచుకునే పచ్చి స్వార్థం తప్ప” .
ఇవీ స్థూలంగా కత్తి వ్యాఖ్యలు. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ హెచ్ ఐ వి వైరస్ కంటే సమాజానికి పవన్ ప్రమాదకారి అంటూ కత్తి మహేష్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.