మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో `సర్కారు వారి పాట` సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం ఓ బ్యాంకు సెట్ వేశారు. అందులోనే షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలకమైన షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేసింది చిత్రబృందం. అన్నీ కుదిరితే.. ప్రస్తుతం యూనిట్ అంతా.. అమెరికాలో ఉండాల్సింది. కానీ.. కరోనా, సెకండ్ వేవ్, స్ట్రెయిన్.. వీటి వల్ల.. అమెరికా షెడ్యూల్ వీలు పడలేదు. అమెరికా లో తెరకెక్కించాల్సిన సన్నివేశాల్ని (ఇండోర్) మొత్తం ఇండియాలోనే తీయాలని నిర్ణయించుకున్నారు. కొన్ని అవుడ్డోర్ సీన్ల కోసం మాత్రం అమెరికా వెళ్లాలి.
కానీ మహేష్ మాత్రం అమెరికా షెడ్యూల్ కి నో చెబుతున్నట్టు టాక్. అమెరికా కాకుండా.. మరెక్కడైనా ఆ షెడ్యూల్ ప్లాన్ చేసుకోమంటున్నాడట. కరోనా భయాల వల్లే.. అమెరికా షెడ్యూల్ మొత్తం పక్కన పెట్టాల్సివస్తుందని టాక్. సినిమా మొత్తం అయ్యాక… అప్పుడు ఆ భాగాల్ని తెరకెక్కించాలన్నది వ్యూహం. ఈలోగా పరిస్థితులన్నీ సెట్ అయితే ఓకే. లేదంటే.. అమెరికా షెడ్యూల్ ని దుబాయ్‌లో ప్లాన్ చేయాలని చూస్తున్నారు. వేసవి వరకూ.. `సర్కారు వారి పాట` ఫారెన్ షెడ్యూల్ లేనట్టే. ఈలోగా షెడ్యూల్స్ అన్నీ హైదరాబాద్ లోనే ఉండేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. బహుశా… ఇక సర్కారు వారి టీమ్, అమెరికా ఫ్లైట్ ఎక్కకపోవొచ్చు.