మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈరోజు ప్రకటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వనీదత్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డెహ్రడూన్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాను ‘పోకిరి’ విడుదలైన తేదీన ఏప్రిల్ నెలలో విడుదల చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే… వవ రోజు చిత్రబృందం స్పష్టత ఇచ్చింది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర చేస్తున్నారు.