మహేష్ బాబు ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారన్నారు. కానీ, స్టార్ట్ చేయలేదు. ఇది మహేష్ 25వ సినిమా కావడం, దీనికి తోడు సినిమా గురించి పలు వార్తలు ప్రచారంలో వుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. సెట్స్ మీదకు వెళ్లకుండా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని సందేహాలు మొదలయ్యాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ రేపటి (ఆదివారం) నుంచి షూటింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు సూపర్ స్టార్ మహేష్. ప్రస్తుతం ఆయన డెహ్రాడూన్ లో వున్నారు. ఈ రోజు ఈవెనింగ్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా అక్కడికి చేరుకున్నారు. సోమవారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మహేష్, పూజ, అల్లరి నరేష్ తదితరులపై కాలేజ్ నేపథ్యంలో సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్న సంగతి తెలిసిందే. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్, హిట్ సినిమాల ప్రొడ్యూసర్ దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.