హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గ్రేటర్ సిటీ నలువైపులా భారీ నివాస, కార్యాలయ భవన ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించేందుకు రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్లు రెడీ చేసింది. మహేశ్వరం వైపు పూర్తిగా మరో సైబరాబాద్ తరహా సిటీకి రూపకల్పన చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఇటీవల అక్కడ జరిగిన సమావేశంలో కీలక ప్రకటన చేశారు.
హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న 29 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిని కలిపేసి రెండు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చాలని అనుకుంటున్నారు. మణికొండ, బండ్లగూడ జాగీర్, నార్సింగి, జల్పల్లి, ఆదిభట్ల, బడంగ్ పేట్, ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్, తుక్కుగూడ వంటి మున్సిపాలిటీలతో మహేశ్వరం గ్రామీణ ప్రాంతాన్ని కలుపుతూ గ్రేటర్ మహేశ్వరం మున్సిపల్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
Also Read :రూ.25 కోట్ల ఖరీదైన ఫ్లాట్స్ – హైదరాబాద్లో లగ్జరీ ట్రెండ్ !
ఈ ప్రాంతాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. యూనివర్సిటీలు, ఐటీ కంపెనీలు ఉన్నాయి. మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచాలని రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారు. రేవంత్ ప్రకటనతో మహాశ్వరం ఏరియాకు మహర్దశ పట్టనుంది. రేవంత్ సర్కార్ కనుక చెప్పినట్టే మహేశ్వరం ప్రాంతాన్ని మరో సైబరాబాద్ గా తీర్చిదిద్దితే గనుక ఈ ఏరియాలో స్థలాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. పెట్టిన పెట్టుబడి డబుల్, త్రిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఓవైపు బెంగళూరు జాతీయ రహదారి. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంకోవైపు ఐటీ హబ్. ఇక ఇప్పుడు ఎయిర్ పోర్టు, మెట్రో ప్రాజెక్ట్. ఓ ప్రాంతం అభివృద్ధికి ఇంతకంటే పెద్దగా అవసరం ఉండదు. . ఐటీ హబ్ కు సమీపంలో ఇళ్లు కొనాలంటే కోటి రూపాయలు ఆపైనే ఖర్చు చేయాల్సిందే.
అదే ఇప్పుడు మహేశ్వరం పరిసర ప్రాంతాల్లో అయితే డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ 50లక్షల నుంచి దొరుకుతుంది. రేవంత్ ప్రకటన తర్వాత ఎక్కువ మంది దృష్టి అటు వైపు పడే అవకాశం ఉంది.