‘గులాబి’తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన కథానాయిక మహేశ్వరి. అప్పట్లో ఆమె ప్రేమ కోసం ఆ సినిమా హీరో జేడీ చక్రవర్తి, దర్శకుడు కృష్ణవంశీ గొడవలు పడ్డారు. హిట్ సినిమాలు, వివాదాలు పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో శ్రీదేవి అక్క కూతురుగా మహేశ్వరి బాగా పాపులర్. మహేశ్వరి కెరీర్ ఫ్లాపుల్లో వున్నప్పుడు శ్రీదేవి హెల్ప్ చేసింది. మహేశ్వరి బ్రదర్ హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు ప్రమోట్ చేసింది. శ్రీదేవి పేరు చెప్పుకుని మహేశ్వరి ఫ్యామిలీ ఎన్నో లాభాలు పొందారు. అటువంటి మహేశ్వరి శ్రీదేవి మరణం తర్వాత ఎక్కడా వార్తల్లో కనిపించలేదు. శఅక్క మృతిపై కనీసం ఒక ముక్క మాట్లాడలేదు. మీడియా వాళ్ళు ఆమెను కాంటాక్ట్ చేయలేదనుకున్నా? ఆమె మీడియాకు కొంత సమాచారం ఇస్తే బాగుండేది. ఆలా కూడా చేయలేదు. శ్రీదేవి సవతి కుమారుడు అర్జున్ కపూర్ కూడా ఆమె మరణవార్త తెలియగానే ముంబైలోని ఇంటికి హుటాహుటిన చేరుకున్నాడు. కానీ, మహేశ్వరి జాడ మాత్రం లేదు. చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొన్నాళ్లుగా శ్రీదేవితో మహేశ్వరి కుటుంబానికి అంతగా పొసగడం లేదు. మనస్పర్థల వల్ల ఏవో గొడవలు జరిగాయని, అప్పట్నుంచి రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది.