అధికారంలోఉన్న సమయంలో అడ్డగోలుగా సంపాదించుకుని అధికారం పోయే సరికి దొరికిపోతానని చెప్పి. పార్టీ మారిపోయిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి పార్టీకి పాఠాలు నేర్పిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనే కానీ బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రతినిధిలానే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఇప్పటి వరకూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన పాపాన పోలేదు సరి కదా.. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు వినొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో అత్యధిక ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో మొదటిది పటాన్ చెరు. జూబ్లిహిల్స్ .. శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో బడా రియల్ ఎస్టేట్ సంస్థలు పై స్థాయిలో పనులు చక్కబెట్టుకుంటాయి. కానీ పటాన్ చెరులో మాత్రం పారిశ్రామిక సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు లోకల్ ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాలపై మీద ఉండాల్సింది. మూడో సారి గెల్చిన మహిపాల్ రెడ్డి సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడం కష్టమని అంటారు. అలాంటి సంపాదన పోగొట్టుకోవడం ఇష్టం లేక.. సంపాదించుకున్నదాన్ని వదులుకోలేక కాంగ్రెస్ లో చేరారు.
ఇప్పటికీ ఆయన కేసీఆర్ ఫోటో నా ఇంట్లో పెట్టుకుంటే.. రేవంత్ ఫోటో పెట్టుకుంటే పెట్టుకుంటా లేకపోతే లేదు నా ఇష్టం అని మీడియా ముందే చెబుతున్నారు. ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసి అలసిపోయిన నేతలు ఉసూరుమంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కాట్ శ్రీనివాస్ గౌడ్ ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.. కానీ నీలం మధు బీఎస్పీ తరపున పోటీ చేయడంతో నలభై వేల ఓట్లు చీలిపోయాయి. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ లో చేరారు.