హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణ తీరు..కొనుగోలుదారుల అభిరుచి మారుతోంది. హై రైజ్ అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణం పెరుగుతోంది. కాస్త స్థితిమంతులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. మంచి ప్రశాంతమైన జీవనం కోసం ఇవి అయితేనే బాగుంటాయని చాలా మంది మధ్యతరగతి ప్రజలు కూడా శక్తికి మించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇవి ఒక సారి కొంటే అయిపోయేవి కాదు.. లోన్ అయిపోయినా ఈఎంఐల తరహాలో ఖర్చులు కూడా భారీగానే ఉంటూంటాయి.
ఇప్పుడు విల్లాలు, స్కై స్క్రాపర్స్ లో నిర్వహణ ఖర్చులు మినిమం ఒక్కో ఫ్లాట్ కు పది వేల వరకూ ఉంటోందంటే.. ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇది నిజం. ఐటీ కారిడార్ లో ఉండేఓ లగ్జరీ అపార్టుమెంట్ లో మామూలు నిర్వహణ ఖర్చుల కోసం ఎస్ఎఫ్టీ లెక్కన వసూలు చేస్తారు. ఒక్కో అపార్టుమెంట్ కు సగటున పన్నెండువేల రూపాయలు వసూలు చేస్తారు. అది ఇతర అపార్టుమెంట్లలోనూ అదే స్థాయిలో వసూలు చేస్తారు. ఇక విల్లాల విషయంలో కాస్త ఎక్కువే ఉంటుంది. అపార్టుమెంట్లలో అయితే ఎక్కువ ఫ్లాట్లు ఉంటాయి. విల్లాల్లో అయితే తక్కువ కాబట్టి ఖర్చు అంతా వాళ్లే భరించాలి.
గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ఈ మెయిన్టెన్స్ భారం ఉంటుంది. సాధారణంగా ఇలా గేటెడ్ కమ్యూనిటీల్లో స్థానిక సంస్థలు సర్వీస్ చేయవు. డ్రైనేజీ, వాటర్ వంటివి చేయవచ్చు కానీ.. రోజువారీ నిర్వహణ కమ్యూనిటీనే చూసుకోవాలి. అందుకు ఖర్చు అవుతుంది. సెక్యూరిటీతో పాటు ఇతర అంశాలను.. కమ్యూనిటీనే చూసుకోవాలి. అందుకే.. పెద్ద పెద్ద విల్లాలు కాకపోయినా మామూలు ఇళ్లు ఉన్న గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా నెలకు ఐదు వేల వరకూ మెయిన్టనెన్స్ అవుతుంది. ఇలాంటివన్నీ చూసుకుని ఇళ్లు కొనుగోలు చేయడం మంచిది.