జాన్వీ కపూర్.. జాన్వీ కపూర్.. అని శ్రీదేవి కుమార్తె నామ జపం చేస్తోంది టాలీవుడ్. తనని ఎలాగైనా తెలుగు తెరకు తీసుకురావాలని చాలామంది దర్శకులు, నిర్మాతలు ప్రయత్నించారు. ఎట్టకేలకు.. ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాతో జాన్వీ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎన్టీఆర్ – శ్రీదేవి.. అప్పట్లో సూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పుడు వాళ్ల వారసులు కలిసి నటించడం… థ్రిల్లింగ్ విషయమే. జాన్వీని తెలుగు సినిమాల్లో చూడాలని తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. సో.. ఈ కాంబోపై కచ్చితంగా అంచనాలు ఉంటాయి.
కాకపోతే.. జాన్వీని తట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తోంది. తన పారితోషికం, చేసే డిమాండ్లు ఆ స్థాయిలో ఉన్నాయి. తెలుగులో ఏ అగ్ర కథానాయిక తీసుకోనంత పారితోషికాన్ని జాన్వీ డిమాండ్ చేస్తోందని సమాచారం. బాలీవుడ్ లో ఎంత తీసుకొందో తెలీదు గానీ, తెలుగులో మాత్రం ఆమె పారితోషికం చూస్తే.. బడా నిర్మాతలు కూడా జడుసుకొంటారు. అంతే కాదు… స్క్రిప్టు మొత్తం ముందే ఇచ్చాయాలని అంటోందట. తన క్యారెక్టర్ ఒకసారి ఫిక్సయ్యాక… మార్చకూడదన్నది మరో షరతు. ఎడిటింగ్ లో తీసేశాం.. షూట్ చేయడం కుదర్లేదు అని చెప్పడానికి వీల్లేదట. నిజానికి ఈ తరహా కండీషన్లు పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా విధించరు. ఆ మధ్య `ఆర్.ఆర్.ఆర్`లో అలియాభట్ పాత్ర ఎడిటింగ్ రూమ్లో కత్తిరించడం వల్ల… జాన్వీ ఈ టైపు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఎంత చేసినా.. ఏం చేసినా తొలి సినిమా వరకే. జాన్వీ స్థాయేంటి? తన వల్ల సినిమాకి ఉపయోగం ఏమిటన్నది తొలి సినిమాకే అర్థమైపోతోంది. ఆ తరవాత.. జాన్వీ కావాలా? వద్దా? ఆమెను భరించడం అవసరమా, లేదా? అనేది దర్శక నిర్మాతలు ఆలోచించుకోవాల్సిన విషయం.