బీజేపీకి అసలైన మిత్రుడు ఒవైసీపీనే ..!

యూపీలోనే కాదు గుజరాత్‌లోనూ బీజేపీని గెలిపించడానికి తన వంతు సాయం చేయడానికి మజ్లిస్ అధినేత ఓవైసీ రంగంలోకి దిగారు. యూపీలో వంద సీట్లకు పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక గుజరాత్‌లోనూ పోటీ చేస్తానని అక్కడ పర్యటించిమరీ ప్రకటించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని ఓవైసీ చెబుతూంటారు. బీజేపీని బద్ద శత్రువుగా పరిగణిస్తూంంటారు. బీజేపీ కూడా అంతే. అందుకే బీజేపీని ఓడిస్తామని బరిలోకి దిగుతున్నామని చెబుతూంటుంది. కానీ ఆ పార్టీ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి అంతిమంగా బీజేపీకి లాభిస్తోంది. మహారాష్ట్ర, బీహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జరిగింది అదే.

మతతత్వ బీజేపీని ఓడించడానికంటూ బలం లేని రాష్ట్రాల్లో కేవలం ముస్లిం ఓట్లను చీల్చడానికి ఓవైసీ పోటీ చేయడం వివాదాస్పదం అవుతోంది. నిజంగా బీజేపీని ఓడించాలంటే ప్రత్యర్థి పార్టీలతో పొత్తులు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకుని వారికి సహకరించాలి. కానీ మజ్లిస్ అలా ఎప్పుడూ చేయదు. సొంతంగా పోటీ చేసి ముస్లిం ఓట్లను చీలుస్తుంది. ముస్లింలు ఎంఐఎంకు ఓటేస్తే బీజేపీకి నష్టం ఉండదు. ప్రత్యర్థుల ఓట్లే చీలుతాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసిన అనేక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప తేడాతో గెలుపొందారు. అక్కడ ఎంఐఎం పోటీతో జేడీయూ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు చీలిపోయాయి. ఈ కారణంగా బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు భారీగా ఓడిపోవడంతో ఎంఐఎం చీల్చిన ఓట్లే కీలకం., అక్కడ శివసేన కలవడంతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. యూపీలో మజ్లిస్ పోటీ చేస్తే ముస్లిం ఓట్లు సమాజ్ వాదీ పార్టీ నుంచి చీలిపోతాయి. అది బీజేపీ నెత్తిన పాలు పోసినట్లు అవుతుంది. ఇక్కడే ఓవైసీ బీజేపీని మద్దతిస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close