ప్రజాస్వామ్యంలో ప్రజలే పవర్ ఫుల్.. వాళ్లని టేకిట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటే తమ పవర్ ఎలాంటిదో చూపిస్తారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో అదే జరిగింది. ఐదేళ్ల కిందట తిరుగులేని అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు జగన్ రెడ్డిని పాతాళంలోకి పంపించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో నిజాయితీగా విశ్లేషించుకుంటే.. .మొత్తం తేలిపోతుంది. కానీ అలాంటి ఆలోచనలు అటు వైపు నుంచి లేవని ఎర్లీ రియాక్షన్స్ చూస్తే అర్థమైపోతుంది. అందుకే అది గాన్ కేస్ అని వదిలేసుకోవడమే మంచిది. రఘురామ కృష్ణరాజు చెప్పినట్లుగా ఇప్పుడు జగన్ ను జనమే వదిలేశారు. ఆయన గురించి మాట్లాడుకుంటే అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లే. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చెడుకే వాడాడు. అందుకే సాగనంపారు. ఇప్పుడు ప్రజలు ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని మాత్రం కూటమికి అధికారం ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే వారు చేసినట్లుాగ చేయకూడదని … చంద్రబాబు మార్క్ పరిపాలన, అభివృద్ధి కావాలన్న కోరికతో మాత్రమే ఓట్లేశారు. వంద శాతం ఇది నిజం. అలాగని గత ఐదేళ్లు జరిగిన అరాచకాలు, దోపిడిని క్షమించమని కాదు.. ఏదైనా చట్ట ప్రకారం పూర్తి చేయాలి.
మొదట ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పెంచాలి !
జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు భయం భయంగా బతికారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. వైసీపీ వాళ్లు చంద్రబాబు ఇంటిపై దాడి చేసి మనుషుల్ని చంపేసినా పట్టని పోలీసులు ఉంటారని తేలింది. టీడీపీ ఆఫీసుపై దాడి చేయించి మా వాళ్లకు బీపీ వచ్చిందనే ముఖ్యమంత్రిని చూసి ప్రజలు భీతావహులయ్యారు. ఈ పరిస్థితి ఐదేళ్లు కనిపించింది. ఏపీలో ఐదేళ్ల పాటు ప్రతీ రోజు వెలుగు చూసిన అరాచకాలు చూస్తూంటే… ప్రజల జీవితాల్ని ఇంత రిస్క్‌లో పెట్టి పోలీసు వ్యవస్థ ఏం బావుకుంటుందో ఎవరికీ అర్థం కాదు. చట్టం పూర్తిగా దుర్వినియోగం అయింది. రాజకీయకారణాలతో నిందితుల్ని వదిలేశారు. తప్పు చేయని వారిని కేసుల్లో ఇరికించారు. అంత కంటే దౌర్భాగ్యం ఏమిటంటే.. తమ సొంత డిపార్టుమెంట్ కు చెందిన వారిపై రాజకీయనేతలుదాడి చేసి కుక్కల్ని కొట్టినట్లుగా కొడుతున్నా.. తుడిచేసుకుని పోయారు. గత ఐదేళ్ల నిర్వాకం కారణంగా పోలీసులు ప్రజల సానుభూతి పూర్తిగా కోల్పోయారు. వారు చేస్తున్న చేష్టలతో పోలీసులు అంటే.. భయపడే పరిస్థితి వచ్చింది. గతంలో భయపడేవారు….కానీ నేరస్తులు భయపడేవారు. ఇప్పుడు నేరస్తులు ధైర్యంగా ఉంటున్నారు. సామాన్యులు భయపడిపోతున్నారు. ఇలాంటి వాతావరణం అసలు ద్రోహం. అందుకే పోలీసులు ఎక్కడైనా ఆపదలో ఉన్నారంటే సాయం చేయడానికి ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేని పరిస్థితి. అయిినా పై స్థాయిలో కొంత మంది క్రిమినల్ పాలకుడికి దాసోహం కావడంతో వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. పోలీసులు తెలుసుకోవాల్సింది ఒక్కటే.. వ్యవస్థను కాపాడితే అది మిమ్మల్నే కాదు.. ప్రజల్ని..రాష్ట్రాన్ని.. దేశాన్ని కాపాడుతుంది. నేరస్తులకు అండగా ఉంటే.. ప్రజలకు..దేశానికి ముప్పు తెచ్చి పెట్టినట్లే. ఇప్పుడు ప్రభుత్వం మారింది.. ప్రభుత్వం కూడా.. గత పాలకులు చేశారు కాబట్టి పోలీసుల్ని ఇష్టారాజ్యంగా వాడుకోకుండా.. చట్ట పరిధిలో వారు తప్పుడు పనులు చేసిన వాళ్లను వేటాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
ప్రభుత్వంపై అడుగంటిపోయిన ప్రజల నమ్మకం
జగన్ రెడ్డి సర్కార్ పై అసలు నమ్మకమే లేదు . ప్రభుత్వమంటే అందరూ భయపడే పరిస్థితికి తెచ్చారు. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం ఎంత దారుణంగా పడిపోయిందో చెప్పడానికి కోర్టుల్లో దాఖలయిన ర్టు ధిక్కరణ పిటిషన్లే సాక్ష్యం. కొన్ని వేల కోర్టు ధిక్కరణ పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ఇవన్నీ న్యాయంకోసం వచ్చినవి కావు. న్యాయం చేయమని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే.. ఆ న్యాయం చేయకపోతే.. పట్టించుకోలేదని కోర్టుకు వచ్చిన పిటిషన్లు. మరి న్యాయంచేయమని వచ్చిన పిటిషన్లు ఇంకెన్ని ఉంటాయి ?, కోర్టుకెళ్తే… ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్న దేశంలో అంతిమ ఆప్షన్‌గానే ప్రజలు కోర్టును ఎంచుకుంటారు . అదీ ప్రభుత్వంపై పోరాటం అంటే.. అసలు సిద్ధపడరు. కానీ ఈ ప్రభుత్వంతో ఇక ఏమీ కాదని.. తమకు న్యాయపోరాటమే దిక్కని వేలు.. లక్షల మంది న్యాయపోరాటం చేస్తున్నారు. ఓ ప్రభుత్వంపై ప్రజలు ఈ స్థాయిలో న్యాయపోరాటం చేస్తున్న వైనం చరిత్రలో ఎక్కడా లేదు. ఇక ముందు ఉండదు కూడా. ఎందుకంటే వచ్చే ఏ ప్రజాపాలకుడైనా.. ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఎవరూ అనుకోలేరు. కోర్టులతోనూ ప్రభుత్వం ఆడుతున్న ఆటలు చూస్తే ఎవరికైనా ఇంత తప్పుడు పాలన చేస్తూ పదవిలో ఉండటం అవసరమా అని అనుకోవడం కద్దు. ప్రభుత్వాన్ని నమ్మిన వారిని కూడా నట్టేటముంచారు. ఇంకా మోసం ఏమిటంటే జీవోలకూ దిక్కు ఉండకపోవడం . 2019లో ఎన్నికల్లో గెలిచి అట్టహాసంగా ప్రమాణం చేసిన తర్వాత జగన్ రెడ్డి మొదటి కేబినెట్ సమావేశంలో కొన్ని వందల నిర్ణయాలు తీసుకున్నారు. చాలా జీవోలొచ్చాయి. కానీ అవన్నీ ఉత్తుత్తి జీవోలుగా మిగిలిపోయాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకూ అదే ట్రెండ్. అమరావతి రైతులకు చెల్లించాల్సిన కౌలుపై జీవో ఇచ్చారు. కానీ డబ్బులు రావు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలపై చర్చలు జరిపి జీవోలిచ్చారు. కానీ ఆ జీవోల్లో ఉన్నది అమలు లేదు. కొన్ని వేల పనులు.. ఆదేశాలు ఇలా జీవోలకే పరిమితమయ్యాయి. ఏమన్నా అడిగితే జీవో ఇచ్చమంటారు.. దాంతో ఆ పని కావాల్సిన వాళ్లు సైలెంట్ కావడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. చివరికి చేస్తే జీవో అమలయినట్లు లేకపోతే లేదు. జీవో గురించి ఆశలు పెట్టుకోవాల్సిన పని లేదని అందరూ ఓ నమ్మకానికి వచ్చారు. ప్రభుత్వ విధానం ఒక్కటే.. జీవో ఇచ్చేసి హామీ నెరవేర్చేశామని చెప్పుకోవడం. అది ఏదైనా అంతే. ప్రజలకు సంబంధించిన అంశంలో అయినా డిమాండ్ వినిపిస్తే ఇదిగో జీవో జారీ చేశామని ప్రచారం చేసుకుంటారు. సమస్య పరిష్కారం అయిదంటారు. కానీ పరిష్కారం మాత్రం అక్కడే ఉంటుంది. ఐదేళ్లు ఇదే జరిగింది. ప్రభుత్వం చెబితే జరిగి తీరుతుందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలి.
ఏపీలో బతకొచ్చనే భరోసా ప్రజలకు కల్పించాలి !
ఏపీలో గత ఐదేళ్లలో ఉపాధి పూర్తిగా కరువయింది. మధ్య తరగతి ప్రజలు చితికిపోయారు. నిరుపేదలుగా మారుతున్నారు వారు కనీసం ద్విచక్ర వాహనాలు కూడా కొనలేకపోతున్నారు. సాధారణంగా ద్విచక్ర వాహనాలను మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొంటారు. అది వారి ఉపాధికి కూడా ఎంతో అవసరం. కానీ ఏపీలో అలాంటి ద్విచక్ర వాహనాలు ఏటికేడు తగ్గిపోతున్నాయి. ఈఎంఐలతో కూడా కొనేంత శక్తి ప్రజల వద్ద ఉండటం లేదు. జగన్ పాలన ఎంత ఘోరంగా ఉందంటే కనీసం ఉచిత రేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేనంత ఘోరంగా ఉంది. ప్రతి ఒక్కరి ఉపాధిని దెబ్బతీశారు . చివరికి ఫ్లెక్సీలు వేసే వాళ్లనీ వదల్లేదు. విశాఖలో ఓ ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేసిన బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొని అప్పటికప్పుడు నిషేధం ప్రకటించారు. ఏదైనా ఓ నిర్ణయం తీసుకోవాలంటే ఓ పద్దతి ఉంటుంది. ముందుగా ఆ నిర్ణయం తీసుకుంటే ఎవరు ఎఫెక్ట్ అవుతారు ? ఎంత తక్కున నష్టంతో ఎలా అమలు చేయాలి ? అలాగే అమలు చేయడానికి ఎంత సమయం ఇవ్వాలి ? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ సీఎం జగన్ స్టైలే వేరు. ఆయనకు ఏది అనిపిస్తే అది ప్రకటిస్తారు. అన్ని ఉపాధి అవకాశాల్ని అంతే నరికేశారు. చివరి యువతను మద్యం దుకాణాల్లో.. షిఫ్ ఆంధ్రా మార్టుల్లో, రేషన్ బండ్లలో పని చేసేలా చేశారు. వాలంటీర్లుగా మార్చారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు తమ బతుకుకోసం… జగన్ రెడ్డిని ఇటికి పంపారు. ఇప్పుడు ప్రభుత్వం ఏపీలో కూడా బతకొచ్చనే భరోసాని కల్పించాల్సి ఉంది.
బాగు చేయాల్సిన పరిస్థితుల్లోనే చంద్రబాబుకు ఎప్పుడూ అధికారం
చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టిన ఓ కారణం ఉంటుంది. అదేమింటే.. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉంది.. కాపాడుకోవాలి.. బాగు చేయాలి అన్న ఉద్దేశంతోనే ఆయనకు అధికారం దక్కుతుంది. రాష్ట్ర విభజన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిన పెట్టారు.కానీ తర్వాత జగన్ గెలిచి అంత కంటే విధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్లీ దాన్ని సరి చేయడానికి చాన్స్ వచ్చింది. అయితే ఇలాంటి సవాళ్లు చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఆయన అంచనాలను ఎప్పుడూ అందుకుంటూనే ఉన్నారు. కానీ ఎంత పని చేస్తే అంతగా ఆయనపై కుల ముద్ర వేయడం.. దాన్ని ఓటర్లు నమ్మడం… కామన్ గా మారిపోయింది. 70 ఏళ్లు దాటినా నిత్యనూతనంగా ఉండే చంద్రబాబు… ఏపీని మళ్లీ గాడిలో పెడతారని… గ్రేట్‌గా మార్చుతారని ప్రజలు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ సారి చంద్రబాబు చేతికి వచ్చింది అధికారమో.. బాధ్యతో కాదు.. అధికార బాధ్యత.