ఖిలాడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది డింపుల్ హయతి. ఈ సినిమా విడుదలకు ముందే డింపుల్ పై ఫోకస్ పెట్టారు టాలీవుడ్ జనాలు. ఖిలాడి బాగా వచ్చిందని, అందులో డింపుల్ గ్లామర్ హొయలు పోయిందన్న వార్తలు రావడంతో… డింపుల్ ని ఎంచుకుందామన్న ఆలోచనలు నిర్మాతలు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి తగ్గట్టు.. ఈ సినిమా ప్రమోషన్లలో కూడా డింపుల్ చిట్టి పొట్టి దుస్తులతో దర్శనమిచ్చేది. లిప్ లాకులకు కూడా అభ్యంతరం చెప్పలేదని తెలియడంతో… కొంతమంది నిర్మాతలు కర్చీఫులు రెడీ చేశారు. గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో కథానాయికగా ముందు డింపుల్ అనే అనుకున్నారు. అయితే `ఖిలాడి` వచ్చాక, ఆ సినిమా చూసి ఫిక్స్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఖిలాడి విడుదలైంది.
ఈ సినిమాలో.. డింపుల్ హయత్ స్కిన్ షోతో.. రెచ్చిపోయినప్పటికీ, తనకు ఏమాత్రం మార్కులు పడలేదు. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఏమాత్రం బాగోకపోవడం, హీరోయిన్ కి తక్కువ, ఐటెమ్ గాళ్ కి ఎక్కువ అన్నట్టు ఆ పాత్ర కనిపించడంతో.. ఇప్పుడు నిర్మాతలు లైట్ తీసుకోవడం మొదలెట్టారు. గోపీచంద్ సినిమాలో కథానాయికగా అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఈ ఆప్షన్ని నిర్మాతలు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో మరో కొత్తమ్మాయి కోసం చిత్రబృందం అన్వేషణ మొదలెట్టింది. ఒకరిద్దరు నిర్మాతలు కూడా డింపుల్ కి అడ్వాన్సు ఇవ్వబోయి.. ఖిలాడి చూశాక మనసు మార్చుకున్నట్టు సమాచారం.