ప్రముఖ మలయాళీ సినీ నటుడు జిష్ణు రాఘవన్ (35) శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో మృతి చెందారు. అయన గత మూడేళ్ళుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. దానికి ఆయన చికిత్స తీసుకొని వ్యాధి నుండి పూర్తిగా కోల్కొన్నారు కానీ కొన్ని నెలల క్రితం మళ్ళీ ఆ వ్యాధి బయటపడింది. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. రెండవసారి క్యాన్సర్ వ్యాధి బయటపడినప్పుడు కూడా ఆయన ఏమాత్రం భయపడకుండా ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటూనే, తను మళ్ళీ త్వరలోనే కోల్కొని సినిమాలు చేస్తాననే దేమా వ్యక్తం చేసేవారు. ఆయన 1987లో కిల్లిపట్టు అనే సినిమాతో బాల నటుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 2014వరకు 20 మలయాళ సినిమాలలో నటించారు. అదే సంవత్సరంలో ట్రాఫిక్ అనే ఒక హిందీ సినిమాలో కూడా నటించారు. అదే ఆయన చిత్రం. అయన తన నటనతో ప్రజలను మెప్పించడమే కాకుండా, సోషల్ మీడియాలో వివిధ అంశాలపై చాలా సానుకూలంగా స్పందించే ఆయన తీరుకి చాలా మంది ఆయన అభిమానులుగా మారిపోయారు. చివరికి ఆసుపత్రిలో మంచం మీద ఉంటూ తన ఆరోగ్యం గురించి, ఆ సమయంలో తన మనసులో మెదులుతున్న ఆలోచనల గురించి ఆయన పెట్టిన మెసేజ్ లలో కూడా ఆశావాద దృక్పధంతోనే నింది ఉండేవే తప్ప ఎక్కడా నిరాశ నిస్పృహలు కనిపించేవి కావు.
జిష్ణు రాఘవన్ కాలికట్ లో ఎన్.ఐ.టి.లో మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. అదే కాలేజిలో ఆర్కిటెక్ చదువుతున్న ధన్యరాజన్ న్ని ప్రేమించి వివాహం చేసుకొన్నారు. విష్ణు తండ్రి రాఘవన్ కూడా ప్రముఖ మలయాళీ సినీ నటుడే. ఇంత చిన్న వయసులోనే జిష్ణు రాఘవన్ ఆకస్మిక మరణించడంతో దక్షిణాది సినీ పరిశ్రమలో వారందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు.