మల్లెల రాజేష్ నాయుడు… .విడదల రజనీ తన వద్ద ఆరున్నర కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపించిన లీడర్. చిలుకలూరిపేట నుంచి విడదలరజనీని గుంటూరుకు పంపిన తర్వాత అక్కడ ఇంచార్జ్ గా ఈ మల్లెల రాజేష్ నాయుడ్నే నియమించారు. ఇలా నియమింప చేసినందుకు ఆరున్నర కోట్లు డబ్బులు తీసుకున్నారు రజనీ. తర్వాత ఇంచార్జ్ పదవి నుంచి తప్పించారు అప్పుడు తన డబ్బులు తనకు ఇవ్వాలని సజ్జల దగ్గర పంచాయతీ పెడితే.. మూడు కోట్లు ఇప్పించి మిగతా వాటి సంగతి మర్చిపోవాలని సలహా ఇచ్చారట.
ఆ మల్లెల రాజేష్ నాయుడు .. ఇప్పుడు టీడీపీలో చేరిపోయారు. తనను మోసం చేసిన విడదల రజనీని ఓడించి తీరుతానని ఆయన పంతం పట్టారు.ఆయనను గుంటూరు పశ్చిమ పరిశీలకుడిగా నియమించారు చంద్రబాబు. గుంటూరు మొత్తం తిరిగి రజనీ చిలుకలూరిపేటలో చేసిన నిర్వాకాల గురించి మొత్తం చెబుతానని ఆయన అంటున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గళ్లా మాధవి పోటీ చేస్తున్నారు. ఆమె పద్దతిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆమె కోసం అందరూ కలసి కట్టుగా పని చేస్తున్నారు. కానీ వైసీపీలో అనేక వర్గాలు ఆమెకు సహకరించడం లేదు. గుంటూరు మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడుకు కూడా చిలుకలూరిపేట నుంచి పోటీ చేసే చాన్స్ వచ్చింది. ఈ కారణంగా అప్పిరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎవరెవరో వచ్చి పోటీ చేస్తున్నారని.. తన సంగతేమిటని ఆయన ఫీలవుతున్నారు. ఆయన వర్గంతో వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఇప్పుడు మల్లెల రాజేష్ నాయుడు కూడా ఆమె ఓటమికి రంగంలోకి దిగుతున్నారు.