సినిమా పరీక్షలు కావివి. రియల్ లైఫ్‌లో కాలేజ్‌లో రాసే పరీక్షలే. ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను’.. ఈ డైలాగ్ ఇండస్ట్రీలో పాపులర్. ‘ఫిదా’ ఫేమ్ సాయిపల్లవి, హీరో రాజశేఖర్… మరికొందరు రియల్ లైఫ్‌లో డాక్టర్లే. కానీ, రవితేజ ‘నేల టిక్కెట్టు’లో డాక్టర్‌గా నటించిన మాళవిక శర్మ మాత్రం లాయర్ కాబోయి యాక్టర్ అయ్యారు. ‘లా’లో డిగ్రీ చేస్తున్నప్పుడు ఆమెకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. నటించారు. అలాగని, చదువుని నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రస్తుతం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ముంబైలోని రిజ్వి లా కాలేజీలో ఆమె చదువుతున్నారు. ప్రజెంట్ ఎగ్జామ్స్ అట. అందుకోసం రేయింబవళ్లు పుస్తకాలు ముందు వేసుకుని కుస్తీ పడుతున్నారు. మొన్నటివరకూ ‘నేల టిక్కెట్టు’ షూటింగు, పబ్లిసిటీ పనులతో చదువుకి చిన్న బ్రేక్ ఇచ్చారు కదా! అందుకని, కుస్తీలు తప్పడం లేదు. భవిష్యత్తులో తాను తప్పకుండా లాయర్ అవుతానని మాళవిక శర్మ చెబుతున్నారు.