ఉన్నది ఒకటే జిందగీ తరవాత రామ్ సినిమా ఒకటి ఎట్టకేలకు ప్రారంభమైంది. గరుడవేగతో ఓ సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకుడు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఎక్కువగా ఫారెన్ లొకేషన్లలోనే షూటింగ్ జరగబోతోంది. కథానాయిక ఎవరో చెప్పకుండానే… ఈరోజు ముహూర్తం పెట్టేశారు. ప్రస్తుతం రామ్కి తగిన జోడీ కోసం వేట సాగుతోంది. ఆ అవకాశం మాళవికా శర్మకి దక్కినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న `నేట టికెట్టు`లో మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోంది. తనైతే రామ్ పక్కన బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. పైగా ఈ సినిమా కోసం ఎక్కువ కాల్షీట్లు కావాలి. స్టార్ హీరోయిన్ అయితే అన్ని కాల్షీట్లు సర్దుబాటు చేయడం కష్టం. అందుకే మాళవిక వైపు దృష్టి పెట్టారని టాక్. ఈ వారంలోనే మాళవిక ఎంట్రీపై ఓ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలున్నాయి.