దేశభవిష్యత్ కోసం.. ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని… తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ, టీడీపీ అధినేత చంద్రబాబు బెంగళూరులోవిస్పష్టమైన అభిప్రాయం చెప్పారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని కూడా పిలుపునిచ్చారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో జేడీఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నారు. దేశభవిష్యత్ కోసం మేమంతా ఏం చేయాలన్నా ధైర్యంగా చేస్తామన్నారు. తమపై ఎవరైనా పోటీకి వస్తే నిర్భయంగా నిలదీస్తామని…ఎదిరిస్తామని..ఓడిస్తామని హెచ్చరించారు. జాతీయప్రయోజనాల పరిరక్షణ కోసం అందరం కలసి పని చేస్తామన్నారు.
బెంగుళూరు చేరుకున్న చంద్రబాబు ప్రాంతీయ పార్టీల నేతులతో విస్త్రతంగా చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాయావతి, లెఫ్ట్ పార్టీల నేతలు కూడా సమావేశమయ్యారు. వారందరి మధ్య కూటమి చర్చలే జరిగాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు కూటమి అవసరం ఉందని.. ఆ దిశగా చొరవ తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బెంగాల్ సీఎం తృణమూల్ సూచించారు. మాయవతి, కేజ్రీవాల్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాంతీయ పార్టీల అధినేతలను చంద్రబాబు తొలిసారి కలుసుకున్నారు. ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత ఉండాలని అందరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది.
చంద్రబాబుతో మమతా బెనర్జీ జరిపిన చర్చల్లో రాష్ట్రాలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు.. మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీల కూటమికి..దాదాపుగా ఓ అంగీకారం కుదిరినట్లు.. ఇరువురు ముఖ్యమంత్రులు తమ మాటల్లో చెప్పకనే చెప్పారు.