పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మళ్ళీ మమతా బెనర్జీయే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయం అయిపోయింది. రాష్ట్ర శాసనసభలో మొత్తం 294 స్థానాలున్నాయి. ఇంతవరకు వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఆమె నేతృత్వంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 143స్థానాలలో ఆధిక్యత సాధించి, 69 స్థానాలలో విజయం సాధించింది. ఆమెను ఓడించేందుకు వామ పక్షాలు తమ బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినప్పటికీ వారి పధకం పారలేదు. పైగా బెడిసికొట్టింది. ఇంతవరకు వామపక్షాలు 26 స్థానాలలో ఆధిక్యత సాధించి కేవలం 04 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ 31స్థానాలలో ఆధిక్యత సాధించి 12 సీట్లు గెలుచుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం చాలా పొరపాటయిందని, దాని వలననే తాము ఓటమి పాలయ్యామని అప్పుడే వామపక్ష నేతలు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇంక ఈ ఎన్నికలలో గెలుస్తామని భాజపా ఎన్నడూ ఆశించలేదు. కనుక దానికి ఒక్క సీటు వచ్చినా అది బహుమతి క్రిందే లెక్క. అది రెండు స్థానాలలో ఆధిక్యత సాధించి 2 సీట్లు గెలుచుకొంది. కనుక పండుగ చేసుకోవచ్చు. 4 స్థానాలలో ఇతరులు గెలిచారు