పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ అద్భుత విజయాన్ని సాధించడం ఖాయమైంది. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి మమతా బెనర్జీ.. ఆమె పార్టీ టార్గెట్‌గా సాగిన బీజేపీ రాజకీయం… ఆమెపై బీజేపీ తెచ్చిన ఒత్తిడి.. అన్నీ..పటాపంచలయ్యాయి. బీజేపీ అనుకూల మీడియా హోరాహోరీ పోరు ఉంటుందని హోరెత్తించినా.. కొన్ని చానళ్లు మరింత ముందడుగు వేసి.. ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారని… తేల్చేసినా.. అవన్నీ అక్కడ ప్రజల అభిప్రాయాలను మార్చలేకపోయాయి. అక్కడి ప్రజలకు ఏకపక్షంగా మమతా బెనర్జీ వైపే ఉన్నారని ఎన్నికల ట్రెండ్స్ చెబుతున్నాయి. 294 స్థానాలున్న బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సునాయాసంగా రెండు వందల మార్క్‌ను దాటనుంది. మమతా బెనర్జీ సాధించిన విజయం చిన్నది కాదు. సీబీఐ..ఈడీ కేసులను బూచిా చూపి.. మమతా బెనర్జీ బలగాలన్నంతా.. బీజేపీ లాక్కుంది.
అయితే తృణమూల్ ఎప్పుడూ తడబడలేదు. సువేందు అధికారి లాంటి నేతను లాక్కుంటే… భ యపడకుండా.. నేరుగా మమతా బెనర్జీనే.. ఆయనపై పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఎటాకింగ్ రాజకీయాలతో ముందడుగు వేశారు. చివరికి మెరుగైన ఫలితం సాధించారు. బీజేపీ రాజకీయాలకు అదే తరహాలో రిప్లయ్ ఇచ్చారు. బీజేపీలో చేరిపోయిన తమ పార్టీ నేతలెవరికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. కొత్త నేతలతో రంగంలోకి దిగారు. మరో వైపు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు కూడా పని చేసినట్లుగా కనిపిస్తోంది. నంద్రిగాంలో నామినేషన్ వేసిన రోజున జరిగిన చిన్న ఘటనతో… ఆమె ఎన్నికల ప్రచారం మొత్తం వీల్ చైర్లోనే తిరిగి నిర్వహించారు. ఆ సానుభూతి వర్కవుట్ అయినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో విడత పోలింగ్ జరిగే కొద్దీ.. మమతా బెనర్జీ ఓడిపోతున్నారంటూ.. పెద్ద ఎత్తునబీజేపీ మైండ్ గేమ్ ఆడింది. అమిత్ షా లాంటి వాళ్లు ట్యాలీలు ప్రకటించేవారు.
దీంతో ఈ సారి మమతా బెనర్జీ ఓడిపోతున్నారన్నప్రచారం ఊపందుకుంది. ఆమె ఓడిపోతున్నారని.. అందుకే… అసహనానికి గురవుతున్నారని మీడియా విశ్లేషించడం ప్రారంభించింది. అయితే.. అలాంటి పరిస్థే లేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. అయితే.. బెంగాల్లో ఇప్పటి వరకూ ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టులు.. కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ వచ్చింది. తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే బెంగాల్ ప్రజలు చూస్తున్నారని మాత్రం స్పష్టమయింది. కొసమెరుపేమిటంటే… సువేందు అధికారి కంచుకోట అయిన నంద్రిగ్రామ్‌లో రిస్క్ తీసుకుని బరిలోకి దిగిన మమతా బెనర్జీ.. ఉత్కంఠ పోటీని ఎదుర్కొన్నారు. మొదట్లో వెనుకబడినా… చివరికి గెలుపు దిశగా వెళ్లడం ఖాయమవుతోంది.