ఎవరైనా తాచుపాముకు ఎదురెళ్తారా..? ఎదురొస్తేనే పారిపోతారు కానీ..!. ఎవరైనా ఎదురు రావాలని కోరుకుంటారా..? వస్తే జడుసుకుంటారు.. కానీ..!. ఎవరైనా వెంటపడి పట్టుకుంటారా…? పాములోళ్లయితే.. పట్టుకుపోతారు..! కానీ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి… తాచుపాముకి ఎదురు వెళ్లలేదు.. అది ఎదురు రాలేదు.. కానీ తనే.. తన పొలంలో ఓ చోట గుట్టుగా ఉన్న దాన్ని వెదికి పట్టుకున్నాడు. దాన్ని చంపేశాడు.. తర్వాత కాల్చుకుని తిన్నాడు. చూడటానికి.. వినడానికి వింతగా.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన.. నిజంగా… జరిగింది. ఆ వ్యక్తి ఆకలి భరించలేక… అలా చేయలేదు.. అడవుల్లో పుట్టి పెరిగినందున అలా చేయలేదు.. కేవలం.. ప్రభుత్వ అధికారుల అవినీతికి నిరసనగా.. వారి వేధింపులను బయట ప్రపంచానికి తెలియడానికి.. ఈ తాచుపాముని పట్టుకుని… కాల్చుకుని తిన్నాడు.
డిస్కవరి, యానిమల్ ప్లానెట్ లాంటి చానళ్లలో.. పాముల్ని పట్టుకుని కాల్చిచంపుకున్న ఘటనలు చూస్తూ ఉంటాం. అవన్నీ ఆఫ్రికాలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలోని పెద్దపల్లి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన కీర్తి శ్రీను అనే వ్యక్తి.. ఇక్కడ చేసి చూపించాడు. ఈ కీర్తి శ్రీను అనే వ్యక్తి సాధారణ రైతు. కొన్నాళ్ల కిందట.. చందపల్లి అనే గ్రామ శివారులో 16 గుంటల భూమినికొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనికి
పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవ్యెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. మరో 15 గుంటల సాదాబైనామా పత్రాల కింద కొనుగోలు చేసి .. ఆ భూమిని పట్టా చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ రెండు పనులు చేయలేదు. అంతే కాదు.. మరో చోట ఎకరం 10 గుంటల భూమి ఉంది దానికి పాస్ పుస్తాకాలు ఉన్నప్పటికి అధికారులు ఆన్ లైన్ చేయలేదు. దాంతో బ్యాంక్ అధికారులు
రుణం ఇవ్వడం లేదు.
ఈ పనుల కోసం… అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాడు.. కీర్తి శ్రీను. ఎన్ని సార్లు చెప్పినా.. పనులు కాకపోవడంతో.. చివరికి … ప్రపంచం మొత్తానికి తెలిసేలా నిరసన ఎంచుకున్నాడు. అధికారులు సతాయిస్తున్నారని విసుగు చెందిన శ్రీనివాస్ తన పంట చేలు వద్దకు వెళ్లి ఒక త్రాచ్ పామును చంపి కాల్చుకొని తిని తన నిరశనను తెలియ జేశాడు. ఈ వీడియో బయటకు రావడంతో వైరల్ అయిపోయింది. ఇప్పుడైనా అధికారులు తన పని చేస్తారని.. కీర్తి శ్రీను ఎదురు చూస్తున్నారు. మరి పని అవుతుందో..మరో పాముని పట్టుకుని తినే వరకూ… సైలెంట్‌గా ఉంటారో..!