మీడియాపై తెలంగాణ ప్రభుత్వ ఆంక్షలూ అదుపూ అనేకసార్లు చర్చకు వచ్చింది. టివి9 ప్రసారాలు ఆపేయడం, ఎబిఎన్ ఆంధ్రజ్యోతిపై దీర్థకాలం కక్ష గట్టడం దేశమంతా చూసింది. ఆ తర్వాత కొందరు మీడియాధిపతులు కెసిఆర్తోచేతులు కలపడం లేదా లొంగిపోవడం కూడా చూస్తున్నదే. అవి సీమాంధ్ర మీడియాగా చెప్పబడే సంస్థలన్నారు.అయితే ఇప్పుడు అచ్చంగా మన తెలంగాణ అని పేరుపెట్టుకుని కెసిఆర్ చేతుల మీదుగానే ఆవిష్కరించబడి అనేక హామీలు కూడా పొందిన పత్రిక తిరుగుబాటు చేసింది. సిపిఐ సీనియర్ నాయకుడు విశాలాంధ్ర రెసిడెంట్ ఎడిటర్‌గా జర్నలిస్టు నాయకుడుగా చిరపరిచితుడైన కె.శ్రీనివాసరెడ్డి కొందరి సాయంతో స్థాపించినపత్రిక ఇది. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తొలి పత్రిక కూడా.ఆ రోజు పత్రిక విడుదల చేసిన కెసిఆర్ అన్ని విధాల తోడ్పాటునిస్తామనీ,ఇప్పటి వరకూ విశాలాంధ్రకు ఇచ్చిన యాడ్ రేటునే కొనసాగిస్తామనీ హామీ నిచ్చారు. పత్రికకు మూడేళ్లయింది గాని హామీ అమలుకు రాలేదు. కొంతకాలం చాలా తక్కువ రేటుకు యాడ్స్ఇచ్చిన టి సర్కారు ఇప్పుడు పూర్తిగా ఆపేసిందట. శ్రీనివాసరెడ్డి మొదటి పేజీ సంతకంతో రాసిన సంపాదకీయంలో ఈ మేరకు సంపాదకీయం రాసి నిరసన ప్రకటించారు.తెలంగాణ అక్షరంపై కక్ష దేనికి అని ప్రశ్నించారు. అయినా తాము నిర్మాణాత్మక విమర్శలు కొనసాగిస్తామని ప్రకటించారు. ఇటీవల దేశంలో పత్రికల రీడర్ షిప్ సర్వే వివరాలు ప్రకటించిన సందర్బంలో తెలంగాణలో తాము మూడో స్థానంలో వున్నామని నమస్తే తెలంగాణ ప్రకటించింది. స్వయంగా కెసిఆర్ కనుసన్నల్లో నడిచే ఆ పత్రికపై సహజంగానే అవ్యాజానురాగం వెల్లివిరుస్తుంది. మన తెలంగాణ మాత్రమే గాక నవతెలంగాణ పత్రిక కూడా ముఖ్యమంత్రి ప్రారంభించి అది వరకటి ప్రజాశక్తి రేట్టు ఇస్తామన్నారు. అక్కడా ఇదే పరిస్థితి. మరి ఈ నిరసనలను ఏమైనా చెవికెక్చించుకుంటారా?