అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘మనం’ సెట్ తగలబడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఘటన జరిగి చాలా కాలమైంది. అయితే ఇప్పటి వరకూ ఇన్సురెన్స్ క్లైమ్ కాలేదని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘మనం’ కోసం ఓ భారీ సెట్ వేశారు. వాటిలోనే చిన్నిపాటి మార్పులు చేసి ‘సోగ్గాడే చిన్ని నాయిన’ లో కీలకమైన సన్నివేశాలు తీశారు. ఆ సెట్‌ని ‘మనం’కి గుర్తుగా ఉంచుకుందామని నాగ్ భావించాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో సెట్ తగలబడిపోయింది. దానికి ఇన్సురెన్స్ ఉంది కాబట్టి.. ఆర్థికంగా నష్టం జరగలేదనే చెప్పాలి. కాకపోతే.. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా… ఇన్సురెన్స్ కంపెనీ నష్టపరిహారం అందించలేదని తెలుస్తోంది. అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా, లేదనే కావాలనే చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేసిన ఇన్సూరెన్సు సంస్థ.. కొన్ని అనుమానాలతో ఈ ఫైల్ పక్కన పెట్టేసిందని, అన్నపూర్ణ స్డూడియోస్ యాజమాన్యం మాత్రం ఇన్సురెన్సు రాబట్టుకోవడం కోసం చేయని ప్రయత్నాలు లేవని విశ్వసనీయ వర్గాల సమాచారం.