శార్వనంద్ మంచి టైమింగ్ వున్న నటుడు. అయితే విజయాలే కలిసిరావడం లేదు. శర్వానంద్ గత చిత్రం ‘ఒకే ఒక జీవితం’ మంచి సినిమానే. కానీ బాక్సాఫీసు వద్ద నిలబడలేదు. శర్వానంద్ అంటే ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి వినోదాత్మక చిత్రాలు గుర్తుకువస్తాయి. నిజానికి శర్వా బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సరిపడా కథలవి. కానీ కొన్నాళ్ళుగా ఆయన కథలు గురి తప్పుతున్నాయి. ఇప్పుడు ‘మననే’ అనే సినిమా వస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి దర్శకుడు. కృతిశెట్టి హీరోయిన్. ఈ ముగ్గురికీ ఈ సినిమా కీలకమే. భలే మంచి రోజు సినిమాతో భలే దర్శకుడు అనిపించు శ్రీరామ్ ఆదిత్య.. తర్వాత వరుసగా శమంతకమణి, దేవదాస్, హీరో సినిమాలతో నిరాశపరిచాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ నిలబడాలంటే ఈ సినిమా విజయం కీలకం. కృతిశెట్టి పరిస్థితి కూడా ఇదే. ఉప్పెన తప్పితే మరో గుర్తుపెట్టుకునే సినిమా ఆమెకు పడలేదు. ఈ మధ్య అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఆమెకు కూడా ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి. ఈ రకంగా ముగ్గురూ ఈ సినిమాపైనే ఆధారపడ్డారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.