మంచు లక్ష్మి గోవాకు వెళ్లారు. తిరిగి వెళ్లేటప్పుడు బ్యాగులో వంటగదిలో వినియోగించే కత్తిని, తినడానికి ఉపయోగించే ఫోర్క్ ను బ్యాంగులో వేసుకుని వచ్చారు. సహజంగా వాటిని విమానాల్లోకి అనుమతించరు. బస్సులు, రైళ్లలో కంటే విమానాల్లోనే ఎక్కువగా తిరిగే మంచు లక్ష్మికి ఈ విషయం బాగా తెలిసే ఉంటుంది. కానీ ఆమె ఎవరు చూస్తారులో అన్నట్లుగా వాటిని బ్యాగులో వేసుకుని వెళ్లారు. కానీ సెక్యూరిటీ చెకింగ్ లో పట్టుకున్నారు. బ్యాగును పక్కన పెట్టారు.
వెంటనే ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు. ఇండిగో ఇలా చేసిందని.. ఎవరైనా సాయం చేయాలని ట్వీట్ పెట్టారు. దీనికి ఇండిగో సంస్థ రిప్లయ్ ఇచ్చింది. మీ బ్యాగ్ లో నిషేధించిన వస్తువులు ఉన్నాయని అందుకే సెక్యూరిటీ వాళ్లు ఆపారని.. తర్వాత వారికి సహకరించినందుకు ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఆ ట్వీట్ పెట్టకపోతే నిషేధిత వస్తువులు తీసుకెళ్లారని ఎవరికీ తెలియదు.కానీ ఇండిగో మీద ఏదో కోపంతో ఆ సంస్థను బ్లేమ్ చేద్దామని ట్వీట్ పెట్టారు . కానీ బ్యాగులో నిషేధిత వస్తువులు ఉన్నాయని ఆ సంస్థ బయట పెట్టడంతో .. మంచు లక్ష్మి అసలు అవేంటో చెప్పాల్సి వచ్చింది.
కత్తి, ఫోర్క్ ఉన్నాయని చెప్పింది. అవి ఉండటం తప్పా అన్నట్లుగా చెప్పి సెక్యూరిటీ ట్యాగ్ వేయలేదని నిష్ఠూరమాడారు. ఎయిర్ లైన్స్ తప్పు ఉంటే.. ఆ సంస్థను అందరూ నిందిస్తారు కానీ.. ఇక్కడ మంచు లక్ష్మి గోవాకు వెళ్లి కత్తి, ఫోర్కుల్ని తెస్తారని అనుకోలేరు. అాలంటి వస్తవులు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అనవసరంగా ఎయిర్ లైన్స్ పై నిందలు వేయబోయి మంచు లక్ష్మి బుక్కయిపోయారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.