మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదానికి మంచులక్ష్మి దూరంగా ఉన్నారు. చాలా రోజుల కిందటే ఆమె ముంబైకి మకాం మార్చారు. తన ఇల్లు అంటూ ముంబై హోమ్ టూర్ చేసి వీడియో పెట్టారు. ముంబైలో హై ప్రోపైల్ పార్టీలకూ వెళ్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. తాను కూడా పార్టీలు ఇస్తున్నారు. మంచు లక్ష్మి లోకం పూర్తిగా మారిపోయింది. తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా ఆదివారం ప్రచారం జరగడంతో సోమవారం ముంబై నుంచి వచ్చారు. తండ్రి, సోదరుడితో మాట్లాడారు.
కానీ ఎవరూ తగ్గే పరిస్థితి లేదని అర్థం కావడంతో వెంటనే వెళ్లిపోయారు. కనీసం ఫిల్మ్ నగర్ లోని తన నివాసానికి కూడా వెళ్లలేదు. అటు నుంచి అటు ముంబైకి వెళ్లిపోయి .. బైబై హైదరాబాద్ అని సోషల్ మీడియాలో స్టేటస్ కూడా పెట్టుకున్నారు. నిజానికి మంచులక్ష్మి కి.. మనోజ్ కుమధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. మనోజ్ రెండో పెళ్లి విషయంలో కుటుంబం వ్యతిరేకంగా ఉన్నా ఆమె చొరవ తీసుకుని తన ఇంట్లోనే పెళ్లి చేసింది.
అయితే ఈ విషయంలో కూడా ఆమె హెల్ప్ లెస్ గా మారిపోయింది. ఎవరూ వినే పరిస్థితి లేకపోవడంతో తాను వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆస్తుల విషయంలోనూ ఆమె తండ్రి ఎంత ఇస్తే అంత అనుకున్నారు. ఇప్పటికే మోహన్ బాబు తన సినీ కెరీర్ లో ఎక్కువకాలం నివసించిన ఫిల్మ్ నగర్ నివసాన్ని మంచు లక్ష్మికే ఇచ్చారు. ఎవరివైపు మాట్లాడినా మరొకరు దూరం అవుతారని మంచు లక్ష్మి దూరంగా ఉంటున్నారని అనుకోవచ్చు.