ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకు తను చేసే కార్యక్రమం ద్వారా మేలు జరిగేలా కార్యచరణలు చేస్తుంది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఆమె మేనుసైతం అనే ప్రోగ్రాంను చేస్తుంది. ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్ధిక సహాయాన్ని అందించేలా ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం మంచు లక్ష్మి స్వయంగా డైరెక్ట్ చేస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ లో రకుల్ ప్రీత్ సింగ్ చేత కూరగాయలు అమ్మించిన లక్ష్మి, ఖమ్మంలో అఖిల్ చేత ఆటో నడిపించింది.
ఇక భళ్లాలదేవ రానాతో కూలీ గెటప్ వేయించి బస్తాలు మోయించింది. అయితే సెలబ్రిటీస్ సహాయంతో తాను ఈ ప్రోగ్రాం చేస్తున్నానని.. తాను ఇది చేయడానికి కలర్స్ టివిలో వస్తున్న ‘మిషన్ సాప్నే’ ప్రోగ్రాం నుండి స్పూర్తి పొందానని చెబుతుంది. ఇప్పటికే 26 డాక్యుమెంటరీస్ రెడీ చేసిన మంచు లక్ష్మి త్వరలో ఈ షోను స్టార్ట్ చేయబోతుందట.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానెల్ జెమినిలో ఇది ప్రసారమవ్వబోతుందని తెలుస్తుంది. మరి మంచు లక్ష్మి మంచి ఉద్దేశంతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగాలని కోరుకుందాం.