నవతరం హీరోలంతా సిక్స్‌ప్యాక్‌లు అంటూ కండలు పెంచేస్తున్నారు. హీరోయిన్లకు ధీటుగా.. స్లిగ్గా మారుతున్నారు. అటు క్లాస్ గెటప్‌కీ, ఇటు మాస్ ఇమేజ్‌కీ సన్నగా ఉండడం ముఖ్యం అనేది వాళ్ల నమ్మకం. అందుకు విరుద్ధంగా బాడీ సైజ్లు పెంచేస్తున్నారు మంచు మనోజ్, నారా రోహిత్. సినిమా సినిమాకీ లావుగా తయారవుతూ, కాస్త ఇబ్బంది పడుతున్నారు.. ప్రేక్షకుల్ని పెడుతున్నారు కూడా. వీళ్లిద్దరి సినిమాలూ ఒకేరోజున విడుదలవ్వడం యాదృచ్చికమే అయినా.. థియేటర్ నుంచి బయటకు రాగానే.. `ఈ బాబులు కాస్త తగ్గాలి` అనిపించారురు.
శౌర్యలో చాలాలావుగా కనిపించాడు మంచు మనోజ్. అదేంటని అడిగితే. పాత్ర కోసం బరువు పెరిగా అన్నాడు. శౌర్య సినిమా చూస్తే.. అదేం పెద్ద రీజన్ అనిపించదు. ఇప్పుడు ఎటాక్‌లో ఇంకాస్త పెరిగాడు. ఈ సినిమాకీ.. తన బరువు పెరగడానికీ ఏమాత్రం సంబంధం లేదు. పైగా సినిమా కోసం ఇలాంటి త్యాగాలు చేయాల్సినంత గొప్ప పాత్రేం కాదు. నారా రోహిత్ పరిస్థితి కూడా ఇంతే. బాణంలో స్లిమ్ గానే ఉన్నాడు. సోలో నుంచి.. బరువు పెరగడం మొదలైంది. తుంటరిలో బాగా లావుగా కనిపించాడు. అది రోహిత్ కూడా పసిగట్టాడు. `త్వరలోనే బరువు తగ్గుతా చూడండి` అన్నాడు గానీ… సావిత్రిలోనూ సైజ్ మారలేదు. ఇంత భారీ శరీరంతో వీళ్లిద్దరూ డాన్సులు చేస్తే చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది. వచ్చే సినిమాకీ.. ఇంతే సైజులతో కనిపిస్తే మాత్రం కష్టమే. అర్జెంటుగా ఈ బాబులిద్దరూ బరువులు తగ్గాలి. తమ తదుపరి సినిమా కాస్త ఆలస్యమైనా ఈవిషయంపై దృష్టి
పెడితే మంచిది.