మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వ్యవహారం దాడులకు కారణం అవుతోంది. తాజాగా మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు మనోజ్ ఇద్దరూ పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. మొదటగా తన తండ్రి మోహన్ బాబు తనని కొట్టాడని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు. అయితే తర్వాత మనోజే తనపై దాడి చేశాడని కొడుకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో పరస్పరంగా దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. మనోజ్ కు గాయాలు కావడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. మోహన్ బాబు తనతో పాటు తన భార్యపై దాడి చేశాడని మనోజ్ పై ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మంచు మనోజ్ కొంత కాలంగా మోహన్ బాబుతో కలిసి ఉండటం లేదు. ఆయన ఆస్తులు పంచేశారని చెబుతున్నారు. అయితే కొన్ని ఆస్తుల విషయంలో ఇంకా వివాదం ఉందని అంటున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్శిటీ విషయంలో తనకుఅన్యాయం జరిగిందని మనోజ్ వాదనలకు దిగుతున్నట్లుగా చెబుతున్నారు. తన సినీ కెరీర్ విషయంలో కన్నా విష్ణు తీసే చెత్త సినిమాలకు వందల కోట్లుఖర్చు పెడుతున్నారని మనోజ్ బాధపడుతున్నారని ఆయన సన్నిహితులు కొంత కాలంగా చెబుతున్నారు. ఆస్తుల విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని అనుకోవడంతోనే దాడులకు దారి తీసినట్లుగా భావిస్తున్నారు.
గతంలోనూ ఓ సారి మంచు విష్ణు, మంచుమనోజ్ మధ్య దాడులు జరిగాయి. ఆ సమయంలో మంచు విష్ణు తాను ఓ వెబ్ సిరీస్ తీస్తున్నానని దానికి అది పబ్లిసిటీ అని కవర్ చేసుకున్నారు. ఈ సారి మాత్రం నేరుగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో ఇది సినిమా కాదని రియల్ ఫ్యామిలీ డ్రామా అని తేలిపోయింది. ఈ వ్యవహారంలో మంచు ఫ్యామిలీ ఎలాంటి కవర్ డ్రైవ్లు చేస్తారో చూడాల్సి ఉంది. మంచు మనోజ్ భూమా అఖిల ప్రియ చెల్లెలను రెండో పెళ్లి చేసుకుని మంచు కుటుంబంతో దూరంగా ఉంటున్నారు.