మంచు మనోజ్ కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేయలేదని పహాడి షరీఫ్ పోలీసులు స్పష్టం చేశారు. మంచు మనోజ్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత సీఐ గురువారెడ్డి మీడియాతో మాట్లాడారు. మంచు మనోజ్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదని… మోహన్ బాబు పై కుటుంబ సభ్యులపై సైతం మనోజ్ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.
ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి అరిచారని.. తమపై దాడి చేశారు అని ఫిర్యాదు చేశారన్నారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేశానని అయినా పారిపోయారన్నారు. దాడిలో తనకు గాయాలయ్యాయని.. తనకు తన కుటుంబం సభ్యులకు థ్రెట్ ఉంది అని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారి వివరాలు కూడా చెప్పలేదని పోలీసులు స్పష్టం చేశారు. మనోజ్ కి ఒక్కరికే గాయాలు అయ్యాయిన్నారు.
ఫిర్యాదులో ఘటన స్థలంలో కిరణ్ రెడ్డి , విజయ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు సీసీ ఫుటేజీని మాయం చేశారని వారి పేర్లు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. 100కు ఫోన్ కాల్ రాగానే వెంటనే రెస్పాండ్ అయి ఇంటి వద్దకు చేరుకున్నామన్నారు.అప్పటికి అంతా హ్యాపీస్ అని చెప్పారన్నారు. ఇప్పుడు మంచు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.