ఆల్ రౌండర్ అనిపించుకొన్న హీరో మంచు మనోజ్. తన సినిమాల్లో యాక్షన్ కొరియోగ్రఫీ తనే చేస్తాడు. పాటలు పాడతాడు. రాస్తాడు. ప్రొడక్షన్ బాధ్యతలూ చూసుకుంటాడు. మాస్ కథలకు సరిగ్గా సరిపోతాడు. కానీ కొన్నేళ్లుగా మనోజ్ నుంచి సినిమాలు రావడం లేదు. తనకీ సినిమాలపై ఆసక్తి తగ్గిందన్న కామెంట్లు వినిపించాయి. కొన్ని ప్రాజెక్టులు ప్రకటించినా – అవి సెట్స్‌పైకి వెళ్లలేదు. అంతెందుకు… మనోజ్ మీడియాకి కనిపించే చాలా కాలమైంది. ఎట్టకేలకు మనోజ్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అహం బ్రహ్మస్మి అనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు ప్రకటించాడు మనోజ్. ఆ తరవాత కరోనా వచ్చింది. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే సినిమాని పట్టాలెక్కించబోతున్నాడట. లాక్ డౌన్ కి ముందే మనోజ్ బాగా లావైపోయాడు. కొన్ని నెలలుగా తన బరువు తగ్గించుకొనే పనిలో తలమునకలై ఉన్నాడని టాక్. నేను మీకు తెలుసా, మిస్టర్ నోకియా సినిమాల్లో ఎంత సన్నగా ఉన్నాడో, ఇప్పుడు అలా తయారవ్వబోతున్నాడట. అందుకే మీడియా ముందుకూ రావడం లేదని తెలుస్తోంది. త్వరలోనే తన రీ ఎంట్రీ గురించి ప్రకటించబోతున్నాడని, ఈలోగా ఫిట్ అయ్యే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.