తెలుగులో ఒకప్పుడు వరుసగా లవర్‌బాయ్ క్యారెక్టర్స్ చేసి, సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన హీరో తరుణ్. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వులేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, నీ మనసు నాకు తెలుసు.. ఇలా ఒకప్పుడు తరుణ్ చేసిన ప్రతి సినిమా హిట్టే. తర్వాత తరుణ్ ఫేట్ మారింది. ఫ్లాపుల మీద ఫ్లాపులతో ప్రేక్షకుల్లో క్రేజ్, బాక్సాఫీస్ దగ్గర మార్కెట్ పోయాయి. ఈ పరిస్థితికి తరుణ్ లవ్ అఫైర్స్, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కారణమని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇటీవల మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తనపై వచ్చిన ఆరోపణలను తరుణ్ ఖండించారు. ఇప్పటికీ ప్రేక్షకుల్లో తనకు లవర్‌బాయ్ ఇమేజ్ అలాగే ఉందని చెప్పుకొచ్చారు.
తనకు తాను ఇంకా లవర్‌బాయ్ అనుకుంటున్న తరుణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘ఇది నా లవ్ స్టోరి’. అన్నదమ్ములు రమేష్, గోపీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచు మనోజ్ గెస్ట్ రోల్ చేశాడు. జస్ట్ రెండు మూడు నిముషాలు కనిపించే క్యారెక్టర్ అంతే. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.