మంచు మనోజ్ వివాదంలో చిక్కుకొన్నాడు. జూనియర్ ఆర్టిస్టులపై చేయి చేసుకొన్నాడని, వాళ్లని దుర్భాషలాడాడని అతనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళ్తే మనోజ్ కొత్త సినిమా షూటింగ్ గత కొంతకాలంగా విశాఖపట్నంలో జరుగుతోంది. అక్కడ స్థానిక జూనియర్ ఆర్టిస్టుల సంఘం నుంచి.. రోజూ ఆర్టిస్టులకు సప్లై చేస్తున్నారు. 15 రోజులకు గానూ.. రూ.15 లక్షలు ఇవ్వాలన్నది ఎగ్రిమెంట్. అయితే నిర్మాత రూ.5 లక్షలే అందించారు. మిగిలిన పది లక్షల కోసం వెళ్తే… నిర్మాతలతో పాటు మంచు మనోజ్ కూడా తమపై దాడి చేశారన్నది జూనియర్ ఆర్టిస్టుల సంఘం ఫిర్యాదు. మనోజ్ కూడా జూనియర్ ఆర్టిస్టులపై రివర్స్‌లో ఓ కేస్ ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. సెట్‌కి వచ్చి.. నానా రాద్దాంతం చేసినందుకు న్యూసెన్స్ కేసు పెట్టినట్టు సమాచారం. ఈరోజు విశాఖపట్నంలో మంచు మనోజ్ ఓ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడు, దానికి కారణం ఇదేనట. మరి మనోజ్ నిజంగానే వాళ్లని కొట్టాడా? లేదంటే ఇదంతా ఫాల్తూ కేసా అనేది పోలీసుల విచారణలో తేలాలి.