హీరోగా ఇండస్ట్రీలో కుదురుకోవడం అంత తేలిక కాదు. ఎంతటి బ్యాగ్ గ్రౌండ్ వున్నా సరైనా ట్రాక్ లో ప్రయాణం చేయకపోకపొతే పట్టాలు తప్పేయడం ఖాయం. మారుతున్న ట్రెండ్ ను అర్ధం చేసుకొని కధలు ఎంపిక చేసుకోవడం, అన్నీటికంటే ముఖ్యంగా ప్రేక్షకులు మనల్ని ఎలాంటి పాత్రల్లో చూడానికి ఇష్టపడుతున్నారో తెలుసుకొని ప్రయాణం సాగించాలి. లేదంటే గమ్యం లేని ప్రయాణంగా మారుతుంది పరిస్థితి.
ఇలా ట్రాక్ తప్పి మళ్ళీ ట్రాక్ పై కి వచ్చిన హీరోల గురించి చెప్పుకుంటే.. రీసెంట్ టైమ్స్ లో నితిన్ కనిపిస్తాడు. కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్లతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు నితిన్. కొంతకాలం ప్రయాణం బాగానే సాగింది. అయితే తర్వాతే ట్రాక్ తప్పేశాడు నితిన్. ‘’అల్లరి బుల్లోడు’’తో మొదలైన నితిన్ ఫాఫుల పరంపర.. ‘’మారో ‘’సినిమా వరకూ కొనసాగింది. దాదాపు పన్నెండు ఫ్లాపులు చూశాడు నితిన్. ఈ దశలో వచ్చిన ‘’ఇష్క్’’ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాడు నితిన్. తనను ప్రేక్షకులు ఎలాంటి పాత్రలోలో చూడానికి ఇస్టపడుతున్నారో అర్ధమైయింది. ‘’మనకు నచ్చిన సినిమా కాదు ప్రేక్షకులకు నచ్చిన సినిమా చేయాలి’’అనే సత్యాన్ని తెలుసుకున్నాడు నితిన్. తర్వాత మొన్న వచ్చిన ‘’అ ఆ ‘’వరకూ నితిన్ ప్రయాణం మళ్ళీ సాఫీగా సాగుతోంది.
శర్వానంద్ ది కూడా ఇదే పరిస్థితి. మొదటి సినిమాతోనే తనలో ఎంత మంచి నటుడు ఉన్నాడో ప్రేక్షకులకు చూపించాడు శర్వా. అయితే తర్వాత మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. తనకంటూ ఒక బాణీ సెట్ చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. తనకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేసేవాడు కానీ తన ముద్ర వేసుకోవడం కుదరలేదు. ఈ దశలో వచ్చిన రన్ రాజా రన్ .. హీరోగా శర్వానంద్ కెరీర్ ను మరో మలపు తిప్పింది. తన బాణీ ఏమిటో శర్వాకు అర్ధమైయింది. తర్వాత వచ్చిన ‘’ఎక్స్ ప్రెస్ రాజా’’ పెద్ద కమర్షియల్ హిట్ ను ఇచ్చింది. మధ్యలో తనలో నటుడిని సంతృప్తి పరుచుకోవడానికి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’’ లాంటి సినిమా చేశాడు. దిన్నీ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఇక రీసెంట్ గా శతమానం భవతితో డిసెంట్ హిట్ కొట్టాడు శర్వా. వెరసి ఇప్పుడు శర్వానంద్ క్రేజీ హీరో.
మరి ఇప్పుడు యమా అర్జెంట్ గా ట్రాక్ పై రావాల్సిన హీరో ఎవరా అంటే మంచు మనోజ్ పేరు వినిపిస్తుంది. ఇప్పటివరకూ దాదాపు ఇరవై సినిమా చేసుంటాడు మనోజ్. ఇందులో ప్రయాణం వేదం లాంటి విలక్షణమైన సినిమాలు వున్నాయి. మరో రెండు ఏవరేజ్ లూ కనిపిస్తాయి. అయితే గత కొంత కాలంగా మాత్రం కుర్రహీరోల రేసులో వెనక బడిపోయాడు మనోజ్. నాని, నితిన్, శర్వానంద్.. ఇప్పుడు కొత్త వచ్చిన రాజ్ తరుణ్ లాంటి హీరోలు తమదైన శైలిలో అలరిస్తుంటే మనోజ్ మాత్రం ఎందుకో బ్యాక్ అయిపోయినట్లు అనిపిస్తుంది. గత కొంతకాలంగా మనోజ్ సినిమాలు వరుసగా నిరాశ పరుస్తున్నాయి. కరెంట్ తీగ, శౌర్య , ఎటాక్.. రిసెంట్ గా వచ్చిన గుంటూరోడు కూడా అంత ఆశ జనకంగా లేదు. సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పుకుంటున్నారు కానీ , వాస్తవం మాత్రం వేరుగా వుంది. పరమ రొటీన్ రొడ్దకొట్టుడు సబ్జెక్ట్ ఇది. తనకు ఊరమాస్ కొత్తగా ఉటుందేమో అని ఉద్దేశంతో మనోజ్ ఈ సినిమాని చేసినట్లు అనిపిస్తుంది. కాని ఈ కధ మనోజ్ కు అతకలేదు. దీంతో సినిమా అంతా అసహజంగా తయారైయింది.
మనోజ్ అలోచించుకోవాల్సిన సమయం ఇది. తనకు ఎలాంటి కధలు నప్పుతయో ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఎనర్జీ లెవల్స్ బావుంటాయనే కాంప్లీమెంట్ వుంది మనోజ్ కు. అయితే ఇప్పుడు కాస్త ఒళ్ళు చేయడం స్క్రీన్ ప్రెజెన్స్ నెగిటివ్ గా మారింది. ఈ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా సబ్జెక్ట్స్ పిక్ చేయడంలో మరింత జాగ్రత్త పడాలి. ఇప్పుడు ట్రాక్ తప్పిన మనోజ్ కు యమా అర్జెంట్ గా ఒక హిట్ పడాల్సిందే. మరా హిట్టు మనోజ్ నుండి వచ్చే కొత్త సినిమాతోనే రావాలని కోరుకుందాం.