ఇటీవల శౌర్య సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మంచు మనోజ్. ఆ సినిమా బాగా నిరాశ పరిచింది. అందుకే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొన్నాడు. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వబోతున్నాడు. మనోజ్ ఖాతాతో ఇప్పుడు మూడు చిత్రాలున్నాయి. సాగర్ ప్రసన్న దర్శకత్వం వహించే ఓ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ చిత్రానికి.. ‘సీతా మహాలక్ష్మి’ (మద్రాస్ ర్యాంబో క్యాప్షన్) య అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈలోగా కె.సత్య అనే మరో కొత్త దర్శకుడికి మనోజ్ అవకాశం ఇచ్చాడు. వరుణ్ అట్లూరి ఈ చిత్రానికి నిర్మాత. కథ ఓకే అయ్యింది. త్వరలోనే ఈ చిత్రాన్నీ సెట్స్‌పైకి తీసుకెళ్తారు. అజయ్ అండ్రూస్ నౌతాక్కి దర్శకత్వంలో మనోజ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. అన్నట్టు రేపు (మే 20) మనోజ్పుట్టిన రోజు. ఈమధ్య బాగా ఒళ్లు పెంచాడు మనోజ్. శౌర్యలో బాగా లావుగా కనిపించాడు. ఇప్పుడు బరువు తగ్గే పనిలో ఉన్నాడు. కనీసం 10 కేజీలు తగ్గాలని మనోజ్ టార్గెట్ ఫిక్స్ చేశాడట. బరువు తగ్గాకే కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.