ప్రణతిని పెళ్లి చేసుకొన్న మంచు మనోజ్ 2019లో విడాకులు తీసుకొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ మనోజ్ ఒంటరిగానే ఉంటున్నాడు. గత కొంత కాలంగా మనోజ్ రెండో పెళ్లి గురించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇరు వర్గాలూ ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో.. ఈ వార్తలకు బలం వచ్చినట్టైంది. ఇప్పుడు మనోజ్ గాసిప్పులకు మరింత హుషారు తీసుకొచ్చాడు. ఈరోజు హైదరాబాద్ సీతాఫలమండిలోని వినాయక విగ్రహాన్ని మనోజ్ సందర్శించాడు. తనతో పాటుగా భూమా మౌనిక రెడ్డి కూడా ఉంది. దాంతో.. వీరిద్దరి పెళ్లి విషయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. సెలబ్రెటీలు పెళ్లికి ముందు తమ జీవిత భాగస్వామితో గుళ్లూ, గోపురాలకు తిరగడం ఈమధ్య ఆనవాయితీగా మారింది. దాంతో తమ పెళ్లి విషయం చెప్పకనే చెప్పినట్టు. మనోజ్ కూడా అదే చేశాడు. వీరిద్దరి పెళ్లి ఖాయమైందని, త్వరలోనే వీళ్ల వివాహం సింపుల్ గా జరిగిపోతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లి కబురు చెబుతారా, లేదంటే సైలెంట్ గా పెళ్లి చేస్కోని, ఆ తరవాత తీరిగ్గా ఆ విషయం లీక్ చేస్తారా? అనేది చూడాలి.