ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో జరిగిన భేటీలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చారు. అయితే ఆ తర్వాత మంచు ఫ్యామిలీ చాలా రచ్చ చేస్తోంది. పేర్ని నాని మోహన్ బాబును కలవడానికి ఇంటికి వస్తే .. చిరంజీవి బృందంతో జరిగిన చర్చలపై వివరణ ఇవ్వడానికి వచ్చారని ప్రచారం చేసుకున్నారు. తీరా అదంతా ఉత్తదని తేలేసరికి మంచు విష్ణు ట్వీట్ కూడా డిలీట్ చేసుకున్నారు. ఆ సమావేశంలో తాను సమావేశానికి రావాలనుకున్నానని కానీ పిలవలేదని మోహన్ బాబు బాధపడ్డారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. పిలవాల్సింది ప్రభుత్వం అనే సంగతిని ఆయన మర్చిపోయాడేమో స్పష్టత లేదు. జగన్‌తో భేటీ అయిన మంచు విష్ణు కూడా అదే పాట వినిపించారు.
మోహన్‌బాబు సహా చాలా పెద్ద హీరోలకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మోహన్‌బాబుకు అందించలేదు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్లో మాట్లాడతాం. ఆ ఆహ్వానం అందకుండా ఎవరు చేశారో తెలుసు. కానీ ఆ విషయం మేమ్ ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటామని మంచు విష్ణు వివాదాస్పదవ్యాఖ్యలుచేశారు. మంచు విష్ణు వ్యాఖ్యలపై ఇండస్ట్రీలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పోసాని కృష్ణమురళి, అలీ, నారాయణమూర్తిలను ఎవరు పిలిచారని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వమే ఆయనను పరిగణనలోకి తీసుకోలేదని ఇప్పుడు పరువు కాపాడుకునే ప్రయత్నంలో రకరకాల ప్రకటనలు చేసి గందరగోళం సృష్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ రాజకీయాలను ఒంటబట్టించుకుని పోయిన పరువు రాబట్టుకునే క్రమంలో మరింతగా ట్రోలింగ్ కు గురవుతున్నారని మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మొత్తంగా లేనిపోని విషయాలను చిరంజీవి కి కల్పించి టాలీవుడ్లో వర్గాలను మరింతగా మంచు ఫ్యామిలీపెంచి పోషిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.