ఏపీ విద్యామంత్రి నారా లోకేష్‌తో మంచు విష్ణు సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో ప్రకటించుకున్నారు. లోకేష్ పాజిటివ్ ఎనర్జీ బ్రిలియంట్ అని ప్రశంసించారు.. కొన్ని విషయాలపై చర్చించామన్నారు కానీ ఏ విషయాల మీద అన్నది మాత్రం చెప్పలేదు. అయితే ఆయన తన బావ అయిన జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తమ కాలేజీలకు పెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల కోసం వచ్చారన్న ప్రాచారం జరుగుతోంది.
ఏపీలో జగన్ రెడ్డి ఫీజు బకాయిలు ఆరున్నర వేల కోట్లు పెట్టిపోయారు. ప్రత్యేకంగా విద్యానికేతన్ ,మోహన్ బాబు యూనివర్శిటీలకు చెల్లించేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు.అన్నింటితో పాటు బకాయిలు పెట్టి పోయారు. అప్పట్లో జగన్ కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. బటన్లు నొక్కారు కానీ ఎన్నికలకు ముందు డబ్బులు జమ చేయలేదు. మొత్తం మూడు త్రైమాసికాలు పెండింగ్ లో ఉన్నాయి.
తమ కాలేజీకి రావాల్సిన నిధుల కోసం మంచు విష్ణు కలిశారని చెబుతున్నారు.అదే చంద్రబాబు విషయంలో కొంత రీఎంబర్స్ మెంట్ పెండింగ్ లో ఉంటే ఎన్నికలకు ముందు కుటుంబం మొత్తం విద్యార్థుల్ని తీసుకుని రోడ్డెక్కారు. అదే జగన్ హయాంలో అయితే కిక్కురమనలేదు. ఎన్నికలకు ముందు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫీజు కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు.