మోహన్ బాబు కుటుంబ వివాదం నేపధ్యంలో పెద్ద కుమారుడు మంచు విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కొన్ని కీలక వాఖ్యలు చేశారు. అసలు ఈ వివాదం రావడానికి, మనోజ్ కుటుంబానికి, తండ్రికి ఎదురుతిరగడానికి కారణం ఏమని అడిగిన ప్రశ్నకు.. ” మా నాన్న చేసిన తప్పు అంతా మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం’ అని కాస్త ఎమోషనల్ గా సమాధానం చెప్పారు. మనోజ్ గురించి అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు విష్ణు.
మోహన్ బాబు మీడియాపై దాటి చేసిన ఘటన గురించి మాట్లాడుతూ.. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. దయచేసి పరిస్థితి గమనించండి. ఇంటి గెట్లు పగలగొట్టి కొందరు ఇంట్లోకి వచ్చారు. ఇలాంటి ఘటన మీంట్లో జరిగితే ఎలా స్పందిస్తారు. ఆ వేడిలో జరిగిన ఘటన అది. దయ చేసి మీడియా కూడా అర్ధం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ జరిగిన ఘటన దురదృష్టకరం. మేమంతా బాధపడుతున్నాం’ అన్నారు
ఇదే సందర్భంలో మంచు లక్ష్మీ ప్రస్తావన వచ్చింది. నాకు అక్కకి బేధాభిప్రాయాలు ఉండొచ్చు. తను ఓ దెబ్బకొట్టినా పడతాను. తను నాకంటే పెద్దది. నేను అలాంటి వాల్యు సిస్టంలో పెరిగానని చెప్పుకొచ్చారు. ఇది ఫ్యామిలీ మేటర్. దయచేసి బయట వాళ్ళు తలదూర్చవద్దని సూచించారు విష్ణు.