మంచు కుటుంబంలో ఫ్యామిలీ సర్కస్పై ప్రజల్ని నమ్మించేందుకు మంచు విష్ణు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా అంతా రచ్చ రచ్చ అయిపోయిన తర్వాత విష్ణు పీఆర్వో ఓ మెసెజ్ మీడియాకు ఇచ్చారు. మంచు ఫ్యామిలీలో కొట్టుకున్నారని.. మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడన్న అవాస్తవం అని స్పష్టం చేశారు. ఎవిడెన్స్‌లు లేకుండా అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. పొడిపొడిగా ఇచ్చిన ఈ రిప్లయ్ లోనే ఆయన ఏదో దాస్తున్నారని సులువుగా అర్థమవుతుంది.
నిజానికి మోహన్ బాబు, మనోజ్ ఘర్షణ పడిన మాట నిజమేనని అయితే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు లేదని తెలుస్తోంది. ఇయల్ 100 కు ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేసి ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ కు వచ్చాయి. మంచు మోహన్ బాబు ఇల్లు శంషాబాద్ కు వెళ్లే దారిలో ఉంటుంది. ఆ ఇల్లు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని అందుకే అక్కడి పోలీసులు ఈ ఫిర్యాదును టేకప్ చేసి మోహన్ బాబు ఇంటికి వెళ్లారని తెలుస్తోంది.
అయితే ఈ అంశాలపై మంచు విష్ణు ఏమీ చెప్పలేదు. మనోజ్ కు గాయాలయ్యాయని.. నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయలేదని మాత్రమే చెబుతున్నారు. మీడియాలో జరుగుతున్న ప్రచారం పోలీసు వర్గాలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారమే. మోహన్ బాబు ఇంట్లో ఘర్షణ జరిగిందన్నది మాత్రం నిజం. అయితే కేసులు పెట్టుకుంటే ఉన్న పరువు కూడా పోతుందని ఆగిపోతారేమో కానీ.. పోలీసులకు అందిన ఫిర్యాదు మాత్రం అబద్దం కాదంటున్నారు.