మంచు విష్ణు పీఆర్ టీం మాట్లాడితే మా బాస్ అమెరికా.. అమెరికా అంటూ ఉంటారు. కానీ మంచు విష్ణు ఇటీవలి కాలంలో దుబాయ్ లో సెటిలయ్యారు. ఏడాది నుంచి ఆయన దుబాయ్ లోనే ఉంటున్నారు. జల్పల్లిలోని మంచు హౌస్ లో ఉండాల్సిన ఆయన దుబాయ్ కు మారిపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు దుబాయ్ కు మారిపోవడం… మంచు లక్ష్మి ముంబైలో సెటిల్ కాకవడంతో మంచు నివాసంలో ఉండేందుకు మళ్లీ మనోజ్ ను ఆహ్వానించారు. ఏడాది నుంచి మనోజ్ జల్పల్లి నివాసంలోనే ఉంటున్నారు.
అయితే మంచు విష్ణు దుబాయ్ కు మకాం మార్పు వెనుక ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఇక్కడ ఉండటానికి భయపడి దుబాయ్ వెళ్లిపోయారని చెబుతున్నారు. అలా ఎందుకు.. ఎవరితో సున్నం పెట్టుకున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్ ప్రైవేటు సంభాషణల్లో విష్ణు ఎందుకు దుబాయ్ కి వెళ్లాడో అందరికీ తెలుసని సెటైర్లు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీల్లో విష్ణు కొంత మందితో గొడవలు పడటంతో ఆయన దుబాయిలో ఉంటున్నారని.. కానీ అమెరికాలో ఉంటున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని చెబుతున్నారు.
మంచు విష్ణు కన్నప్ప అనే సినిమా తీశారు. ఆ సినిమాలో చాలా మంది స్టార్లను కామియోలుగా ఒప్పించారు కానీ.. ట్రైలర్ తేలిపోయింది. విష్ణు శివయ్య అనే అరుపుతో మొత్తం ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయింది. ఈ క్రమంలో దానికి బజ్ లేదు. పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో విష్ణు ముందస్తుగా దుబాయ్ కు మకాం మార్చడం హాట్ టాపిక్ గా మారింది.