మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో దిగినప్పటి నుండి ఆయనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం.. ఈ రెండిట్లో ఎదో ఒక పేరు ప్రస్థావించడానికి ప్రయత్నించి విష్ణు.. టంగుటూరి వీరేహం ప్రకహం పంతులు అని ఒక చిత్రమైన సౌండ్ కాయిన్ చేశాడు. దీని తర్వాత ఒక రేంజ్ లో ఆయనపై మీమ్స్, ట్రోల్స్ దాడి మొదలైయింది. ఇది ఇప్పటికీ ఆగడం లేదు. ఆయన ఏ వేడుకలో మాట్లాడిన దాన్ని ట్రోల్ చేసేస్తున్నారు. ఆయనపైనే కాదు విష్ణు కుటుంబంపై కూడా ట్రోల్స్ ఆగడం లేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ ట్రోల్స్ పై స్పందించాడు విష్ణు.
”నాపై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. మీపై ట్రోల్స్ వస్తుంటే పట్టించుకోరేంటి అని ‘మా’ ఎన్నికల సమయంలో చాలామంది నన్ను అడిగారు. అప్పుడు ఎలక్షన్పైనే దృష్టి పెట్టా. ఇప్పుడు ట్రోల్స్ చేసిన వారిపై పెట్టా. నా కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని కొందరు విమర్శించారు. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. జూబ్లీహిల్స్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీతోపాటు ఓ ప్రముఖ నటుడి ఆఫీసుకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లు బయటపడ్డాయి” అని చెప్పుకొచ్చారు విష్ణు. అయితే ప్రముఖ నటుడని అన్నారు కానీ ఆ నటుడి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు విష్ణు.