మందకృష్ణ మాదిగ తన జీవితాన్ని మాదిగల కోసం త్యాగం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఆయన టార్గెట్ . అది సాధించారు. అయినా విశ్రమించడం లేదు. రాష్ట్రాల్లో అమలయ్యేలా చూసేందుకు తిరుగుతూనే ఉన్నారు. ఆయన దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆయన ఎప్పుడూ ప్రజాప్రతినిధి కాలేదు. ఆయనను రాజ్యసభకు పంపేందుకు చంద్రబాబు చాలా సార్లు ఆఫర్ ఇచ్చారు. కానీ తిరస్కరించారు. వైఎస్ మంత్రిని చేస్తామన్నారు. బీజేపీ కూడా రాజ్యసభ ఆఫర్ ఇచ్చింది. కానీ దేన్నీ ఆయన స్వీకరించలేదు. మొండిగా సొంతంగా ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు కానీ ఆయా పార్టీల్లో చేరేందుకు మాత్రం రెడీ కాలేదు.
మాదిగ నేతలకు ఏ కష్టం వచ్చినా ఆయన రెడీగా ఉంటారు. పార్టీలతో సంబంధం ఉండదు. ఎవరో చెబితే మరొకరిపై విమర్శలు చేయడం అనేది ఆయన డిక్షనరీలోనే ఉండదని ఆయన గురించి తెలిసిన వారికి.. రాజకీయాల్లో ఉన్న వారికి తెలుసు. పవన్ కల్యాణ్‌పై మంద కృష్ణ చేసిన వ్యాఖ్యలతో చాలా మంది టీడీపీ హస్తం ఉందని సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. మందకృష్ణ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మరి దానికి ఏమంటారు ?
చంద్రబాబుపైనా మందకృష్ణ ఎన్నో సార్లు ఆరోపణలు చేశారు. వర్గీకరణ విషయంలో కూడా చంద్రబాబు అడిగినప్పుడు స్పందించలేదని అనేక సార్లు నిందించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు రావెల కిషోర్ తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉద్యమాలు చేశారు. అవన్నీ గుర్తున్న వారికి టీడీపీ ప్రమేయంతో పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తారని అనుకోలేరు. మందకృష్ణ డబ్బులకు ఆశపడే ఉద్యమనేత కాదు. ఆయన ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటారు. ఆస్తిపాస్తులేమీ లేవు. ఈ విషయం పవన్ కల్యాణ్ కు కూడా తెలుసని..అందుకే మందకృష్ణను ఆయన గౌరవిస్తారు.
ఉమ్మడి రాష్ట్రం కుల సంఘాల్లో ఎమ్మార్పీఎస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అది మందకృష్ణ వల్లనే వచ్చిందనుకోవచ్చు. ఆయన ఎప్పుడూ ఇతర కులాల్ని కించపర్చరు. తన కులం కోసం మాత్రమే మాట్లాడరు. మందకృష్ణ స్పెషాలిటీ అదే అనుకోవచ్చు.