మంగళగిరి ఎస్ఐను సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకో.. వైసీపీ లీడర్కు కొమ్ము కాసినందుకో కాదు.. తన ఓటును ఐదు వేలకు అమ్ముకున్నందుకు. ఆధారాలతో సహా దొరికిపోవడంతో సస్పెండ్ చేయక తప్పలేదు ఉన్నతాధికారులకు.
మంగళగిరి ఎస్ఐ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయనకు సొంత ఊరిలో ఓటు ఉంది. ఎస్ఐగా విధుల్లో ఉండటంతో పోస్టల్ బ్యాలెట్ గా నమోదు చేసుకున్నారు. అక్కడ వైసీపీ నేతలు ఓట్ల కొనుగోలు చేపట్టారు. ఎస్ఐ ఓటుకు ఐదు వేలు విలువ కట్టారు. దానికి ఎస్ఐ అంగీకరించారు. ఆ డబ్బులు ఊళ్లో బంధువలకు ఇచ్చారు. వారు ఫోన్ పే ద్వారా ఎస్ఐకి పంపించారు.
ఎస్ఐ రాత బాగోలేదు.. డబ్బులు పంచిన వాళ్లు అక్కడ పోలీసులకు పట్టుబడ్డారు. పోస్టల్ బ్యాలెట్ల కొనుగోలుపై ఈసీ సీరియస్ గా దృష్టి పెట్టడంతో విచారణ తప్పలేదు. డబ్బులు పంచిన వాళ్లు జాబితా అంతా పోలీసులకు ఇచ్చారు. ఇందులో ఎస్ఐ పేరు కూడా ఉంది. ఐదు వేలు అందుకున్నట్లుగా స్పష్టత రావడంతో సస్పెన్షన్ ఓటు వేశారు. ఓటును ఐదు వేలకు అమ్ముకునే ఎస్ఐ తన విధుల్ని ఎలా నిష్ఫక్షిపాతంగా నిర్వహిస్తారు ?.