ఈ మధ్య కాలంలో దాదాపు సినిమాలు పార్ట్2 , సీక్వెల్, ప్రీక్వెల్, ప్రాంచైజ్ ప్లానింగ్ తోనే వస్తున్నాయి. కొనసాగింపు ఎప్పుడు వస్తుందో చెప్పడం లేదు కానీ.. సినిమా ముగింపు లో పార్ట్ 2 లీడ్ మాత్రం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అజయ్ భూపతి ‘మంగళవారం’ సినిమాకి కూడా పార్ట్ 2 ఉండబోతుంది. స్వయంగా దర్శకుడే ఈ విషయాన్ని చెప్పారు. ”’మంగళవారం’ సినిమాకు పొడిగింపు అయితే ఉంటుంది. సీక్వెల్, ప్రీక్వెల్, ఫ్రాంచైజీ… ఏం అంటారో నాకు తెలియదు. ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు అజయ్ భూపతి.
‘మంగళవారం’ చిత్ర విశేషాలు పంచుకుంటూ.. జీరో ఎక్స్పొజింగ్ మూవీ ఇది. ఒక్క వల్గర్ షాట్ తీయలేదు. పాయల్ క్యారెక్టర్ చాలా షాకింగా వుంటుంది. నాపై నమ్మకంతో ఈ సినిమా చేసింది. చివరి 45 నిమిషాలు లెవల్ ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కమర్షియల్ సినిమాలు ఒక మీటర్ మీద వెళతాయి. కానీ, మంగళవారం లాంటి సినిమాలు తీయడం కష్టం. ప్రేక్షకులకు ఖచ్చితంగా ఓ కొత్త అనుభవాన్ని ఇస్తుందనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చారు అజయ్. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.