సూపర్ స్టార్ రజినికాంత్ అంటే సౌత్ లోనే కాదు యావత్ భారతదేశం.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో చాలా చోట్ల అభిమానులు ఉన్నారు. రజిని సినిమా విడుదల అంటే ఆ హంగామానే వేరు. ప్రస్తుతం కబాలి సినిమా షూట్ లో ఉన్న రజిని గురించి ఓ వింత ప్రశ్న ఎదురైంది దర్శక దిగ్గజుడు మణిరత్నంకు. బెంగుళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుండగా అక్కడకు వచ్చిన మణిరత్నంను పశ్నలతో ముంచెత్తారు అభిమానులు.
ఆ క్రమంలో ఓ అభిమాని మీరు రజినికాంత్ జీవితకథ ఆధారంగా సినిమా ఎందుకు తీయడంలేదు అని అడిగాడట. దానికి మణిరత్నం సమాధానమిస్తూ అది మంచి ఆలోచనే అయినా ఆ పాత్రకు తగ్గ నటుడు దొరకడం చాలా కష్టం అనేశాడట. ఇతిహాసాలను ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా సినిమాలను తీయడంలో మణిరత్నం చాలా స్పెషల్. కర్ణుడు, దుర్యోధనుడు పాత్రల ప్రభావంతో ఆయన తెరకెక్కించిన ‘దళపతి’ అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది.
రజినికాంత్, మమ్ముట్టి నటించిన ఆ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. మణిరత్నంతో రజిని చేసిన సినిమా అదే కావడం విశేషం. మరి మణిరత్నం చెప్పినట్టుగా రజిని జీవిత కథకు రీల్ హీరో ఎవరు లేడు అన్నది నిజమే అనిపించినా వెతుకుతూ ఉంటే తారసపడటం ఖాయం అనైతే చెప్పగలం. కొద్దిరోజులుగా ఫేడవుట్ అయిన మణిరత్నం మళ్లీ లాస్ట్ ఇయర్ ఓకే కణ్మణి (తెలుగులో ఓకే బంగారం) తో మళ్లీ ఫాం లోకి వచ్చారు.