గౌతమి పుత్ర శాతకర్ణి తరవాత క్రిష్ చేయబోయే సినిమా ఖాయమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ని మణికర్ణిక పేరుతో వెండి తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఝాన్సీ పాత్రలో కంగనా రనౌత్ కనిపించబోతోంది. ఝాన్సీ అసలు పేరు మణికర్ణిక. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ ఖరారు చేశారు. ఈ కథని విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఈరోజు వారణాసిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవానికి వారణాసినే ఎందుకు ఎంచుకొన్నారంటే… ఝాన్సీ లక్ష్మీబాయ్ పుట్టింది అక్కడే. ఈరోజు సాయంత్రం కాశీలోని గంగాహారతి కార్యక్రమంలో మణికర్ణిక చిత్రబృందం పాల్గొనబోతోంది. ఈ సందర్భంగా కంగనా 20 అడుగుల ‘మణికర్ణిక’ పోస్టర్ని ఆవిష్కరించనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించనున్నారు. జూన్లో షూటింగ్ ప్రారంభమవుతుంది. 2018 ప్రధమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.