175 సీట్లు గెలిచేస్తామని జగన్ రెడ్డి అండ్ దబాయిస్తున్నది ఎలా అంటే… ఓటర్ల జాబితాలను గోల్ మాల్ చేసి.. మాకు ఓట్లేసి వారిని మాత్రమే ఉంచి… మిగతా వారిని జాబితాలో నుంచి తీసేయడం ద్వారా . దీనిపై అత్యున్నత స్తాయిలో కుట్రలు జరిగాయి. ఇప్పుడా విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే.. ప్రభుత్వ పెద్దల పన్నాగం… ప్రజాస్వామ్యాన్ని ఎలా హత్య చేయాలనుకున్నారో అన్న విషయం బ యటపడుతుంది.
ఉరవకొండ రిటర్నింగ్ ఆఫీసర్‌పై వేటు
అనంతపురం జిల్లా ఉరవకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. ఉరవకొండ ఆర్వోగా జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఆయనను సీఈసీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఉరవకొండలో 6 వేల దొంగ ఓట్లను చేర్చడంతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించిన అంశంపై సీఈసీకి పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. ఉరవకొండలో ఓట్ల ప్రక్రియను పరిశీలించిన సీఈసీ అధికారులు.. ఓట్ల అవకతవకల్లో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉందని తేల్చారు. భాస్కర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. అయితే ఇంకా పలువురు అధికారులపై చర్యలు,, కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది. అవన్నీ ఇంకా బయటకు రాలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో కుట్ర
ఓట్ల తొలగింపు కుట్ర ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలో జరిగింది కాదని.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని.. వైసీపీ మంత్రుల మాటల్ని బట్టి సులువుగానే అర్థం చేసుకోవచ్చు. మంత్రి సీదిరి అప్పలరాజు.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేరుగా అధికారులకు … తమ వారికి ఆదేశాలిస్తూ.. దొరికిపోయారు. టీడీపీ ఓట్లు అయితే తొలగించాలని అబ్జెక్షన్ చెప్పాలని..సూచించారు. బయటకు చెప్పకుండా దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ అదే జరుగుతోంది. తాజాగా పర్చూరు నియోజకవర్గంలో ఏడు వేల ఓట్ల తొలగింపునకు స్కెచ్ వేసినట్లుగా ఆధారాలతో సహా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఓట్ల తొలగింపు కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ పని చేస్తున్నారు.
ప్రజాస్వామ్య హత్యకు పట్టపగలు ప్లాన్
స్వతంత్ర దేశంలో ప్రజాస్వామ్యం నిలబడటానికి కారణం ఎన్నికలు. ప్రజలు ఓట్లు వేయడం. ఆ ప్రజలకు … ఓట్లు నిరాకరించడం ద్వారా.. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ప్లాన్ చేశారు. ఇందులో అధికారుల్ని భాగం చేస్తున్నారు . ఇప్పుడు అసలు స్కెచ్ బయటపడింది. నిందితులు అందర్నీ… ప్రభుత్వ పెద్దలు అయినా సరే వదిలి పెట్టకుండా… పట్టుకుని బాధ్యుల్ని చేయాల్సిన బాధ్యత.. ఎన్నికల సంఘంపై ఉంది. లేదంటే.. ప్రజాస్వామ్య హత్యలో వారూ భాగస్వాములైనట్లే.